హైదరాబాద్ లో గుంతలు పూడ్చలేనోడట ఇండియా ను అమెరికా చేస్తడట!

హైదరాబాద్ లో గుంతలు పూడ్చలేనోడట ఇండియా ను అమెరికా చేస్తడట!

నాకు మమతా ఫోన్ చేసింది మద్దతిచ్చింది, నాకు హేమంత్ సొరేన్ ఫోన్ చేసిండు, ఇంకొకాయన ఫోన్ చేసిండు అని నీకు నువ్వు  డబ్బా కొట్టుకుంటున్నావ్. అవును దేశంలోని అవినీతిపరులంతా జట్టు కట్టండి, మా మీద ఓడిపోయేటోళ్లంతా ఒక ఫ్రంట్ పెట్టండి. మా మోడీ తెలంగాణాలో అడుగు పెడితే మీ ఫ్రంట్ కాదు కదా మీ టెంట్లు కూడా ఊడపీక్కోవాల్సి వస్తుంది. వేచి చూడండి. 

సీఎం గారు, అసలు నీ పంచాయితీ అంతా నీ కొడుకును సీఎం చేయాలనే కదా. అదేదో స్ట్రెయిట్ గా చెప్తే సరిపోతది కదా. దేశంలో రాజకీయం, గుణాత్మక మార్పులు వంటి పెద్ద పెద్ద పదాలు ఎందుకు చెప్పండి. 

మాట మాట్లాడితే రాజ్యాంగం అట్లా ఉండాలి ఇట్ల ఉండాలి అని జోరుగా ముచ్చట్లు చెప్తున్నారు. అపార మేధావి, దళిత రత్న అయిన అంబెడ్కర్ మన రాజ్యాంగాన్ని రచించారు. అటువంటి మన రాజ్యాంగం మీద లెక్టర్లు దంచడానికి మీరు అంబెడ్కర్ కంటే గొప్పవారా? చిన్న రాష్ట్రాల విషయంలో అంబెడ్కర్ ఆదర్శం అన్నోడివి ఇప్పుడెందుకు నీ చిల్లర రాజకీయాల కోసం అంబెడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమానిస్తున్నావు.

ముఖ్యమంత్రి గారు ఎంత సేపు 70 ఏళ్లలో వాళ్ళేం చేశారు వీళ్ళేం చేశారు అని కేజ్రీవాల్ లాగా ఊకదంపుడు ఉపన్యాసాలు దంచుతున్నారు. అసలు ఈ నాలుగేళ్లలో ముఖ్యమంత్రిగా తెలంగాణకు నువ్వేం చేశావో చెప్పు. తెలంగాణ ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీల సంగతేంటో చెప్పు. 

70 ఏళ్ళు పరిపాలించింది కాంగ్రెస్, బీజేపీ లు అని బీజేపీ ని కాంగ్రెస్ ని ఒక్కటిగా చూపెట్టే కుట్ర చేస్తున్నారు. వాస్తవానికి బీజేపీ పరిపాలించింది కేవలం 10 ఏళ్ళు మాత్రమే. కెసిఆర్ ముఖ్యమంత్రిగా గానీ, కేంద్ర మంత్రిగా గానీ, రాష్ట్ర మంత్రిగా గానీ బీజేపీ కంటే ఎక్కువేళ్ళు పరిపాలించారు. మరి ఇన్నేళ్ళలో మీరు తీసుకువచ్చిన గుణాత్మక మార్పేంటో సెలవివ్వండి. 

నేపాల్ కు మనకు మధ్య నది ఉన్నది, భూటాన్ కు మధ్య నది ఉన్నది, ఆ నదుల పంచాయితీ ఇప్పటికి తెంచరు  అని ముఖ్యమంత్రి గారు ముచ్చట్లు బాగా చెప్తున్నారు. ఆటలాంటి ముచ్చట్లు గంటలకు గంటలు ప్రతోడు చెప్పగలుగుతడు. ప్రగతి భవన్ లో కూర్చొని పనికి రాని ముచ్చట్లు చెప్పే బదులు నీకు చేతనైతే వాటికి పరిష్కారం ఏందో చెప్పు.

మనం కూడా చైనా లా ఉండాలంటడు. అసలు నీ యావ అంతా కూడా చైనా అధ్యక్షులు జింపింగ్ లా జీవితమంతా నేనే సీఎంగా ఉండాలనా లేకపోతే చైనాలో ఉన్నట్లు ఇక్కడ కూడా ఏక పార్టీ పాలన పెట్టి దేశంలోని అన్ని పార్టీలను రద్దు చేసి తెరాస ని ఒక్కద్ధాన్నే ఉంచాలనా?

అమెరికా లా ఉండాలన్నావ్.... సరే మంచిది.. చాలా బాగా చెప్పినారు. అప్పుడెప్పుడో వరంగల్ ను వాటికన్ చేస్తానన్నావ్, కరీంనగర్ను డల్లాస్ చేస్తానన్నావ్, హైదరాబాద్ ను ఇస్తాన్బుల్ చేస్తానన్నావ్. మొదలు నువ్వు వాటి సంగతి చెప్పు. వరంగల్ వాటికన్ అయ్యిందా? కరీంనగర్ ను ధల్లాస్ చేసినవా? హైదరాబాద్ ఇస్తాన్బుల్ అయిందా? హైదరాబాద్ లో గుంతలు పూడ్చలేనోడట ఇండియా ను అమెరికా చేస్తడట!

దావఖానా నడిపియ్యడం ఢిల్లీల కుసున్నోనికి ఏం తెలుస్తది అని ప్రశ్నించారు. ఢిల్లీల కుసున్నోడు కూడా నీలాగా గల్లీల గెలిచి వచ్చినోడే అనే కనీస జ్ఞానం లేదా మీకు?

కేంద్రం కహానీలు చెప్తే మనం వినాలి అని కెసిఆర్ గారు అన్నారు. అసలు మంచి మంచి కట్టు కథలు చెప్పేది మీరే కదా! అల్లుడొస్తే అత్త ఎక్కడ ఉండాలి, ఆర్నెల్లల మీ ఇండ్లు రెడీ అయితయి, నేను మళ్ళొస్తా కోడ్ని కోసి కళ్ళు తెప్పించుండ్రి, దావత్  చేసుకుందాం అని పిట్ట కథలు చెప్పింది ఎవరు?, హుస్సేన్ సాగర్ ను కొబ్బరి నీళ్లలా చేస్తా అని కథ అళ్లిందెవరు? 

కాంగ్రెస్ పోతే బీజేపీ, బీజేపీ పోతే కాంగ్రెస్ అని ముఖ్యమంత్రి గారు అంటున్నారు. మరి ఇక్కడ మీరు పోతే, మీ సుపుత్రుడు కేటీఆర్ లేకపోతే మీ సుపుత్రిక కవిత సీఎం అవుతారు తప్ప ఒక దళితుడో, ఒక బీసీ ఏమైనా ముఖ్యమంత్రి అయ్యేదుందా చెప్పండి. 

ఉపాధి హామీ కూలీలకు కూడా ఢిల్లీలో తప్పాలో డబ్బులేసేంత గొప్ప దేశం మనది, ఇక్కడున్న ప్రభుత్వం ఎక్కడ పాయె అని మాట్లాడుతున్నారు. ఉపాధి హామీ పథకంలో 95 శాతం కేంద్రం డబ్బులు ఇస్తుంటే నువ్వు 2,000 కోట్లును సీసీ రోడ్లు వేయడానికి పక్కదారి పట్టించి పేదోళ్ల కడుపు కొడితిరి. మీ లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే కేంద్రం నేరుగా జిల్లాల కలెక్టర్ల ద్వారా కూలీలకు డబ్బులు ఇస్తున్నది. 

ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన... ఈ  గ్రామీణ రోడ్లతోని ప్రధానమంత్రికి ఎం సంబంధం అసలు నాకర్ధం కాదు అని అన్నారు. మరి ఊర్లో ఉన్న మోరీలతోని నీకేం సంబంధం అసలు? స్థానిక సంస్థలకు అధికారాలను బదలాయించమంటే, వాటి అధికారాలను కూడా మీరే గుంజుకొని, వాటికి కేంద్రం ఇచ్చే డబ్బులను సైతం సర్పంచులని బెదిరించి 30 శాతం డబ్బులను కరెంటు బిల్లులని, జీతాలని చెప్పి గుంజుకొనే మీరు అధికారాల బదలాయింపు గురించి మాట్లాడడమా?

విద్యా విధానం రాష్ట్రాలకు అప్పగించాలి, వైద్య విధానం రాష్ట్రాలకు అప్పగించాలి, వ్యవసాయ విధానం రాష్ట్రాలకు అప్పగించాలి. అర్బన్ డెవలప్మెంట్ రాష్ట్రాలకు అప్పగించాలి అని గొంతు చించుకుంటున్నావ్. ఇవి రాష్ట్రాల పరిధిలోనే ఉన్నాయనే కనీస అవగాహన లేకుండా ఈ  సీఎం పరిపాలన ఎట్ల చేస్తున్నాడు? ఈ అంశాల్లో ఈ నాలుగేళ్లలో మీరు చేసింది ఏందో జర ప్రజలకు చెప్పండి. 

రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని అన్నాలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు. మేము కూడా అదే అడుగుతున్నాం. వ్యవసాయం రాష్ట్రాల పరిధిలోని అంశం. తెలంగాణాలో మీరు వచ్చినంక నాలుగు వేల మంది రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? పక్క రాష్ట్రాలు ఇచ్చినట్లు ఒక 500 బోనస్ ఇవ్వమంటే ఎందుకు ఇవ్వరు? కాంట్రాక్టుల మీద ఉన్న సోయి రైతుల మీద ఎందుకు లేదు?

ఫసల్ బీమా లో రైతులకు ఎవరికన్న డబ్బులు వచ్చినాయి అని అడుగుతున్నారు. మీరు కట్టాల్సిన ప్రీమియం కట్టకపోతే రైతులకు డబ్బులు ఎట్లా వస్తాయి. మీ పదవుల భీమా మీదా ఉన్న శ్రద్ధ ఫసల్ బీమా మీద ఉంటె బాగుండేది. 

దేశానికి నేను దశ దిశా ఇస్తా అని అంటున్నారు. ఎక్కడి నుండి? మీ ఫార్మ్ హౌస్ నుండా? సెక్రటేరియట్ కి రాలేని మీరు దేశానికి దశ దిశా ఇవ్వడం.... ఇంతకంటే పెద్ద జోక్ ఇంకొకటి లేదు. 

 దేశాన్ని కులాల పేరు మీద మతాల పేరు మీద రాజకీయం చేస్తున్నది బీజేపీ అని అన్నారు. కులానికో పథకం, మతానికో పథకం పెట్టింది ఎవరు? మీరా మేమా?

అసలు మీ కొత్త కహానీలు కారణం ఏంటి? పుత్రోత్సవాహమా లేక బీజేపీఫోబియానా లేక ఆ రెండా?

కేశబోయినశ్రీధర్

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!