చైనా_పాకిస్థాన్ కారిడార్ కు సంబందించిన భయంకరమైన నిజాన్ని బయట పెట్టిన పాక్ సెనెటర్

చైనా_పాకిస్థాన్ ఆర్ధిక కారిడార్ కు సంబందించిన మరొక భయంకరమైన నిజం వెలుగులొకి వచ్చింది. ఈసారి ఈ విషయాన్ని సాక్ష్యాత్తూ పాకిస్థాన్ సెనెటర్ వెల్లడించడం విశేషం.   చైనా లొని క్స్జింజాంగ్ ప్రాంతం నుండి పాకిస్థాన్ లొని గ్వాదర్ పొర్టు వరకు 60 బిలియన్ డాలర్ల పెట్టుబడితొ  చైనా_పాకిస్థాన్ ఏకనమిక్ కారిడార్   ను చైనా  నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే అత్యంత పెద్దదయిన ఈ కారిడార్ నిర్మాణానికి చైనా, భవన నిర్మాణ కార్మికులను కాకుండా …. జైలు ఖైదీలను ఉపయొగిస్తుందిట. చైనా లొ అనేక నేరాలకు పాల్పడి జైలు శిక్ష విధించబడ్ద ఖైదీలను, పాకిస్థాన్ లొకి ఆర్ధిక కారిడార్ నిర్మాణానికి ఉపయొగిస్తుందిట. ఈ విషయాన్ని సాక్ష్యాత్తు పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP) కి చెందిన సెనెటర్ మొహమ్మద్ యూసఫ్ తల్పూర్ బయట పెట్టడం విశేషం. దీనితొ పాకిస్థాన్ లొ అనేక వేల మంది చైనా ఖైదీ లు పనిచేస్తున్న విషయం వెలుగులొకి వచ్చింది.
పాకిస్థాన్ లొ నిర్మిస్తున్న కారిడార్ పై ఖర్చు తగ్గించుకొవడానికి, ఏప్పుడు ఏటునుండి కారిడార్ పై దాడి జరుగుతుందొ నన్న భయంతొ చైనా, తన దేశంలొని ఖైదీలను ఈ కారిడార్ నిర్మాణానికి ఉపయూగిస్తున్నట్టు తెలుస్తుంది.
కాగా ఈ విషయంపై పార్టీ సెనెటర్ మొహమ్మద్ యూసఫ్ తల్పూర్ తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశాడు.  చైనా_పాకిస్థాన్ ఆర్ధికా కారిడార్ నిర్మాణం చేపట్టిన దగ్గరి నుండి పాకిస్థాన్ లొ నేరాలు రెట్టింపు అయ్యాయని గుర్తు చేశారు. వేల మంది చైనా ఖైదీలు దేశంలొ స్వచ్చగా తిరుగుతుంటే నేరాలు ఏందుకు జరగవని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా గత మూడు సంవత్సరాలలొ వందకు పైగా చైనీయులు, స్థానిక పాకిస్థానీలపై దాడులు చేసిన సంఘటనలు వెలుగులొకి వచ్చాయని ….. వెలుగులొకి రాని సంఘటనలు ఏన్నొ ఉన్నాయని ఆయన తెలియజేసారు.
By sources

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!