అమిత్ షా గారు ఫోన్ చేసారు అని చెప్పింది ఎవరు?
అమిత్ షా గారు ఫోన్ చేసారు అని చెప్పింది ఎవరు?
3 రోజుల ముందే ఫోన్ చేసి చెబితే రాష్ట్రం ముందు దేశం తరువాత అనే ఈ అపర చాణుక్యుల వారి భజన బృందం కౌటిల్యుని అర్ధశాస్త్రాన్ని మించిన శాస్త్రం చేయగల మంత్రివర్యులు ఆర్థిక నిపుణులు ముఖ్యమైన సమావేశానికి సమయానికి వెళ్లకుండా విమానం లేటయ్యింది ... ఇంట్లో పెళ్ళాం వంట లేటయ్యింది లాంటి సాకులు చెబుతుంటే ఖచ్చితంగా వీరి రాష్ట్రభక్తిని వేనోళ్ళ పొగడాల్సిందే .టైం కి మీటింగులకు వెళ్ళలేరు కానీ టైం పెట్టి మరీ పోలవరం అమరావతి కడతారంట...
ఒక జాతీయపార్టీ అధ్యక్షుడి సమయం ఎంత విలువైనదో వీళ్ళకి తెలియదా?? చెప్పిన సమయానికంటే ముందే వెళ్ళాలి అనే ఇంగిత జ్నాణామ్ లోపించిందే??
వీళ్ళ వరస చూడబోతే అసలు ఆయనను కలవడానికి ఇష్టం లేక రెండో విమానానికి వెళ్లారు అనిపిస్తుంది.... మొన్న జైట్లీ గారు కూడా అన్నారు ఇంతవరకూ లోటు వివరాలు పంపలేదు ఆల్రెడీ మేం లెటర్ రాసి నెల అవుతుంది అని....
రాష్ట్రప్రభుత్వ వైఫల్యాలు మొత్తం కేంద్రం నెత్తికి చుట్టి ఎన్నికల్లో కేంద్రాన్ని ముద్దాయిని చేసి లబ్ధిపొందే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తుంది అని సామాన్య జనం కూడా నమ్ముతున్నారు... నిజాయితీగా ఉండడం వేరు... నటించడం వేరు ..నటన ఎప్పటికైనా బయటపడుతుంది...
By sources
Comments
Post a Comment