కేవలం రాజకీయ ఉదేశ్యాలతొనే NDA నుండి వైదొలగారు – చంద్రబాబుకు మొదటి లేఖాస్త్రం సంధించిన అమిత్ షా
బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారు, ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రికి మొదటి విడత లేఖాస్త్రాలు సందించారు. మీకు, ఐదు కోట్ల మంది ఆంధ్రులకు ఉగాది శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం మీ అందరికీ సంతోషాన్ని, మంచి ఆరోగ్యాన్ని తీసుకొస్తుందని కోరుకుంటున్నాను అంటూ లేఖను ప్రారంభించిన అమిత్ షా, చంద్రబాబు నాయుడికి గట్టి కౌంటర్ ఇచ్చారు.
అభివృధి కొసం కాకుండా, కేవలం రాజకీయ ఉదేశ్యాలతొనే, టిడిపి నుండి వైదొలగినట్తు అమిత్ షా గారు దుయ్యబట్టారు. ఆంద్రప్రదే అభివృధి కొసం మొదటి నుండి పొరాడుతుంది బిజెపి యేనని, ఏపీ విభజన సమయంలో తెలుగు రాష్ట్రాల హక్కులను పరిరక్షించడంలో బీజేపీ ముందుందని తెలియజేశారు. గతంలో తెదేపాకు లోక్‌సభలోగానీ, రాజ్యసభలోగానీ సరైన ప్రాతినిధ్యం లేనప్పుడు భాజపానే అజెండా తయారుచేసిందని గుర్తుచేశారు. పోలవరానికి రూ.5,364కోట్లు కేటాయించామని చెప్పిన ఆయన చంద్రబాబు ప్రభుత్వం నుంచి జరిగిన తీవ్రమైన తప్పిదాలను ఎప్పటికీ విస్మరించలేమన్నారు. ఏపీకి సంబంధించి ఏ చిన్న విషయంలోనూ వెనకడుగు వేయలేదని వివరించారు. ఏపీ అభివృద్ధికి నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకారం అందించిందని తెలిపారు.
వెనుకబడిన జిల్లాల అబివృధి కొసం ఇచ్చిన నిధులలొ కేవలం 12% మాత్రమే ఎక్కలు చూపారని మిగతా నిధులు ఏమైనట్లని ఆయన ప్రశ్నించారు. రాజధానికి ఇచ్చిన నిధులలొ కేవలం 8% నిధులకు మాత్రమే లెక్కలు చూపారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు చేసే ప్రతి పైసా ఖర్చును ప్రజలకు లెక్క చెప్పల్సిన భాద్యత ప్రభుత్వాల మీద ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఆంద్రప్రదేశ్ కు కేంద్ర విద్యా సంస్థలను, ఎయిమ్స్ ను, 180 కిలోమీటర్ల మేర అమరావతి చుట్టూ రింగ్ రోడ్ ను, గుంతకల్ – గుంటూరు లైన్ డబ్లింగ్ ప్రాజెక్టు వ్యయం రూ.3,631 కోట్లతొ పాటు, మూడు ఏయిర్ పొర్టులను అంతర్జాతీయ ఏయిర్ పొర్టులుగా మార్చిన విషయాన్ని అమిత్ షా గారు ప్రస్థావించారు. వీటితొ పాటు కొత్త రైల్వేలైన్ నిర్మాణానికి నిధులు కేటాయించామని, NDA ప్రభుత్వం, ఆంద్రప్రదేశ్ కి ఇచ్చే సాయాన్ని రెండింతలు చేసిందని అమిత్ షా గారు స్పష్టం చేశారు. కాని టిడిపి అభివృధి గురించి, కాకుండా రాజకీయ కారణాలతొ NDA నుండి వైదొలగిందని ఆయన పేర్నొన్నారు
By sources
Comments
Post a Comment