దేశం ఎటుపోతోందో అంటాడు ఒకడు కానీ రసీదు అడక్కపోతే మిగిలే 10 రూపాయలు వదులుకొడు!!

దేశం ఎటుపోతోందో అంటాడు ఒకడు కానీ రసీదు అడక్కపోతే మిగిలే 10 రూపాయలు వదులుకొడు!!

దేశం ఎటుపోతోందో అంటాడు ఒకడు కానీ పన్ను ఎలా ఎగ్గొట్టాలి అని ప్రణాళికలు వేస్తాడు!!

దేశం ఎటుపోతోందో అంటాడు ఒకడు కానీ ఇన్కమ్ టాక్స్ కట్టాలి అంటే అబ్బే ఎందుకు కట్టాలి అంటాడు!!

దేశం ఎటుపోతోందో అంటాడు ఒకడు కానీ ఏళ్ల తరబడి ఇంటి పన్ను కట్టకుండా ఉంటాడు!!

దేశం ఎటుపోతోందో అంటాడు ఒకడు కానీ కానీ తన ఇంట్లో చెత్త రోడ్డు మీద పడేస్తాడు!!

దేశం ఎటుపోతోందో అంటాడు ఒకడు కానీ పాన్ తిని రోడ్డు మీద ఉమ్మేస్తాడు అటూఇటూ చూసి!!

దేశం ఎటుపోతోందో అంటాడు ఒకడు కానీ జనం మధ్యలో సిగరెట్ కాలుస్తాడు!!

దేశం ఎటుపోతోందో అంటాడు ఒకడు కానీ ఓటుకి నోటు ఇస్తే కానీ పోలింగ్ బూతుకి రాడు!!

దేశం ఎటుపోతోందో అంటాడు ఒకడు కానీ పిల్లలకి పెద్దలని గౌరవించడం నేర్పడు!!

దేశం ఎటుపోతోందో అంటాడు ఒకడు కానీ జాతీయ గీతం వస్తే నిలబడే ఓపిక ఉండదు!!

దేశం ఎటుపోతోందో అంటాడు ఒకడు కానీ డ్రైవింగ్ లో రాంగ్ రూటులో వెళ్తాడు!!

దేశం ఎటుపోతోందో అంటాడు ఒకడు కానీ కులపొడు తప్పు చేస్తే గుడ్డిగా వెనకేసుకొస్తాడు!!

దేశం ఎటుపోతోందో అంటాడు ఒకడు కానీ తాగేసినా టీ గ్లాస్ డస్ట్ బిన్నులో వెయ్యమంటే కోపం వస్తుంది!!

దేశం ఎటుపోతోందో అంటాడు ఒకడు కానీ నేను నాది అంటూ స్వార్ధంతో బతికేస్తాడు!!

దేశం బాగుండాలి అంటే ఒక వ్యక్తి ఏదో చేస్తే అవ్వదు అందరూ ఈ దేశం నాది అనుకుంటే బాగుపడుతుంది!!


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!