ఒక పథకం ప్రకారం మోదీ పై జాతి వ్యతిరేక శక్తులు పెద్ద పెట్టున దుష్ప్రచారం చేస్తున్నాయి...
ఒక పథకం ప్రకారం మోదీ పై జాతి వ్యతిరేక శక్తులు పెద్ద పెట్టున దుష్ప్రచారం చేస్తున్నాయి... ప్రజల మనసుల్లో విషాన్ని నింపుతున్నాయి. దీనిని తిప్పి కొట్టడం భారతీయుల బాధ్యత. దేశభక్తి లేని రాష్ట్ర భక్తి.. జిల్లా భక్తి ఉండవు.. హిందూ ధర్మం మన రక్తపు నైజం.. మన డీ ఎన్ ఏ. దానిని మరచిపోతే మానవత్వం చచ్చిపోయినట్టే!
ఇప్పుడు ఈ దారుణాలు మన దేశంలో యథేచ్ఛగా జరుగుతున్నాయి!
దీనికి నిరసనగా.. ప్రధాని మోదీకి నా మద్దతు.. సంఘీభావం తెలియజేస్తున్నాను.
మోదీ పాలనలోని కొన్ని లోపాలను, కొన్ని విజయాలను కూడా నిష్పాక్షికంగా, నిర్భీతిగా నేను గతంలో అనేక పోస్టుల్లో తెలియజేశాను... మంచికి మెచ్చుకున్నా.. చెడును విమర్శించాను కూడా!
కానీ ఇప్పుడు దేశంలో ఉన్న దారుణ పరిస్థితులు.. అరాచక, అనాగరిక, దిగజారుడు రాజకీయాలకు ఆంధ్రప్రదేశ్ వేదికగా మారిన నేపథ్యంలో... ప్రధాని నరేంద్ర మోదీ కి పూర్తి మద్దతును, సంఘీభావాన్ని ప్రకటిస్తున్నాను.
మోదీ వ్యతిరేకుల్లో కుల తత్వం, మత తత్వం, అవినీతి, ప్రాంతీయ విద్వేషం, దుగ్ధ, రాజకీయ అసహనం... విరివిగా కనిపిస్తుండడమే నా ఈ పోస్టుకి కారణం!
కులాన్ని, మతాన్ని, వ్యక్తిగతాన్ని, ప్రాంతాన్ని .. ఇలా అన్నిటినీ ఆయుధాలుగా చేసుకొని నిస్సిగ్గుగా మోదీ పై దాడి చేస్తున్న రాజకీయ నాయకుల్లో, మేధావి నామక వ్యక్తుల్లో అర్హతలను, నైతికతను, వారి ట్రాక్ రికార్డుని పరిగణనలోకి తీసుకుంటే చాలామందికి అసలు మోదీని విమర్శించే కనీస అర్హత కూడా లేదు.
మోదీ అవినీతిపరుడు కాదు.. మోదీ దేశద్రోహి కాదు మోదీని అదే పనిగా విమర్శించే వారిలో 99 శాతం మంది అవినీతిపరులే! అనేకమంది దేశంపై ఆపేక్ష లేనివారే. ఇదొక్కటి చాలు భారతీయులు మోదీ ని సమర్థించడానికి! జై హింద్.. జై భారత్ మాతా!
Comments
Post a Comment