పవన్ దీక్ష : ఒక దెబ్బకు రెండు పిట్టలు.

పవన్ దీక్ష : ఒక దెబ్బకు రెండు పిట్టలు.        1.శ్రీరెడ్డి పవన్ మీద వ్యాఖ్యలు చేసింది 18వ తేదీన. 19న tweet తో సరిపెట్టి.. 20న దీక్ష. ఎందుకంటే... 20వ తేదీన ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు తన జన్మదినం రోజునే నిరాహారదీక్ష చేపట్టారు. ఇక రికార్డుల కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే ఇండస్ట్రీ నుంచి వచ్చిన పవన్ కు ఈ రోజు భరత్ అనే నేను సినిమా రిలీజ్ అనే విషయం బాగానే గుర్తు ఉండే ఉండాలి. లేకపోతే, ఒక మహిళ చేసిన వ్యాఖ్యను అడ్డం పెట్టుకొని రచ్చ చేయడం వ్యర్థం. కానీ అందివచ్చిన అవకాశాన్ని వదులుకుని అమాయకులు కాదు మెగా సోదరులు. అందుకే కదా అమ్మ సెంటిమెంటును బాగానే రక్తి కట్టిస్తూ ఫిలింనగర్ లో హడావుడి మొదలుపెట్టారు. ఇదివరకే శ్రీరెడ్డి, భాగం ఉందని... క్షమించమని రాం గోపాల్ వర్మ కూడా బహిరంగంగా కోరారు. మరి ఈ సినిమా దీక్ష వల్ల పవన్ తాను ఆశించిన ప్రయోజనాలను ఎంతవరకు సాధిస్తాడో చూడాలి.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!