స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రాయ్‌బరేలీ ప్రజలు వంశపారంపర్య రాజకీయాలనే చూస్తున్నారని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు.
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రాయ్‌బరేలీ ప్రజలు వంశపారంపర్య రాజకీయాలనే చూస్తున్నారని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు.
శనివారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
హిందూ మతాన్ని అప్రతిష్ఠపాలు చేయడానికి కాషాయ ఉగ్రవాదం అనే పదాన్ని ఉపయోగించినందుకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్‌ను డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుండటం వల్ల కాంగ్రెస్ హిందువులకు క్షమాపణ చెప్పదన్నారు.
యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం రాయ్‌బరేలీని అభివృద్ధి చేస్తుందని చెప్పారు.
రాయ్‌బరేలీ నుంచి చాలా మంది కాంగ్రెస్ అత్యున్నత స్థాయి నేతలు ఎన్నికయ్యారని, కానీ అభివృద్ధి మాత్రం జరగలేదని ఆరోపించారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రైతుల కోసం కృషి చేస్తోందని, నేరస్థులపై విరుచుకుపడుతోందని, మహిళలకు భద్రత కల్పిస్తోందని ప్రశంసించారు.
Comments
Post a Comment