#నరేంద్రమోదీ #IAmWithModi #నేనునీతోనేనరేంద్రమోడీ

#నరేంద్రమోదీ #IAmWithModi #నేనునీతోనేనరేంద్రమోడీ దాదాపుగా నాలుగు సంవత్సరాల అలుపెరగని శ్రమ.. ముక్కోటి ముష్కర మూకల నిరంతర మానసిక దాడులు..అనేక శల్య పరీక్షలు..అసహన వాదులు..ఢిల్లీ లోనే తిష్ట వేసి ఇసుక రేణువుని కూడా పర్వతంలా చూపాలని ప్రయత్నించే వార్తా కల్తీ కారులు.. సామాజిక ఉద్యమ కారుల ముసుగులో పరాన్న జీవులు..ఎంత మానసిక నిబ్బరం అయ్యా నీది?ఎంత మనోబలం ఇచ్చాడయ్యా ఆ విధాత నీకు..

ఒక గూఢచర్య మాజీ అధికారి చెప్పినట్లు..2014 లో నువ్వు గనుక గద్దెనెక్కకుండా ఉండి ఉంటే భారత ఆత్మ,ఆధ్యాత్మికత ని సమూలం గా నాశనం చేసేసే ప్రణాళిక రచించబడిపోయింది..ఈ దేశ ప్రజల మెదళ్లలో తమ సంస్కృతి పట్ల సనాతన చరిత్ర పట్ల,తమ ఆధ్యాత్మిక ఔన్నత్యం పట్ల,సామర్ధ్యం పట్ల అనుమాన బీజాలు బలంగా నాటి వేళ్లూనుకునే పరిస్థితి వచ్చేసింది...వంద కోట్ల హృదయాలు ఆత్మ విశ్వాసం కోల్పోయే పరిస్థితి ఎదురయ్యింది..ఏ పరాత్పరుడు సహజ ప్రకృతి న్యాయ సూత్రాలని సృష్టించాడో ఆ సర్వేశ్వరుడే నిన్ను 2002 లో నిన్ను గుజరాత్  ముఖ్య మంత్రి ని చేసినదగ్గరనుండీ, నీ పై ముద్రలు వేసి అవమాన పరిచిన దగ్గర నుండీ నీ సహనాన్ని,మనో బలాన్ని పెంచి సాన పెట్టి నిన్ను సిద్దంచేస్తూ వచ్చి దేశం ముందు నిలబెట్టాడు.. నువ్వు చేసే ప్రతీ అంశంలో,వేెసే ప్రతీ అడుగులో నీ మాట నిబద్ధత,కసి లో ఈ విషయం మరింత స్పష్టంగా కనపడుతుంది.. 

నీ అంకిత భావాన్ని,అకుంఠిత ధర్మ దీక్షని ఇంకా కొంతమంది ఈ దేశ వాసులే అనుమానిస్తున్నా చిరునవ్వుతో పక్కన పెట్టి సాగిపోయే కర్మయోగీ.. దశాబ్దాల కల్తీని,సోమరితనాన్ని,అసహజ,అమానుష రాజకీయలని పక్కన పెట్టి ఈ దేశం నాది అనుకునే ప్రతీ ఒక్కరినీ తలెత్తుకుని గర్వ పడేలా చెయ్యాలనే నీ తాపత్రయం, శ్రమ వలన ఈ మూడున్నర సంవత్సరాల నీ పరిపాలనలో మొట్ట మొదటి సారి నిన్న నీ మొహంలో,కళ్ళల్లో అలసట చూశానయ్యా..
15 సంవత్సరాల నీలాప నిందలూ,మానసిక దాడులని తట్టుకుని,విజేతవై నిలిచిన మానసిక నిపుణులకే అర్ధం కాని నీ అమేయ శక్తి ,అకుంఠిత దీక్ష నిన్ను శారీరకంగా కొంచెం అలసి పోయేలా చేసిందేమో తెలీదు,నిన్ను ఈ దేశ జనం ఇంకా పూర్తిగా అర్ధం చేసుకోలేదనే చిన్న బాధ నీ గుండెల్లో కలుక్కుమంటోందేమో తెలీదు కానీ అది మా మనసుల్ని మెలిపెట్టేస్తోంది....

నీ సంకల్పాన్ని,నీ ధర్మ నిరతని నమ్మే వాడిగా,నీ శ్రమ,కలలు త్రికరణ శుద్ధిగా ఈ దేశం కోసమే అని విశ్వసించే వాడిగా చెబుతున్నా.. నా ప్రతీ ఆలోచన నీతోనే... జగత్ కళ్యాణం కోసం ఆ జగన్మాతని ప్రార్ధించే నా ప్రతీ ఉచ్చారణ శక్తిలో సగం నీకే...నేను పీల్చే ఊపిరిలో ప్రతీ వందలో ఒక దాని శక్తిని నీకే ధార పోస్తున్నా.. నువ్వు అలవకూడదు..ఈ దేశ కీర్తి ప్రపంచం నలుమూలలా మారు మోగే వరకూ.. నీ శక్తి ఇసుమంతయినా తగ్గకూడదు.. ఈ దేశాన్ని సాంస్కృతికంగా  కాలుష్యం చేసిన అంతః శత్రువుల కుత్తుకల్ తెగి నేల వ్రాలి పడేవారకూ నీ వాడి వాడకూడదు.. అప్పటి వరకూ I am With Modi, నేను నీతోనే నరేంద్ర మోడీ....జై శ్రీరామ్.. జై హింద్


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!