#మొత్తం_చదవండి Why should we support Narendra Modi

#మొత్తం_చదవండి
Why should we support Narendra Modi 
అవినీతి మరక లేని వాడు... బంధు ప్రీతి, కుటుంబ వారసత్వాల పీడ అంటని వాడు ... 
భారత దేశాన్ని అగ్ర రాజ్యాల సరసన నిలపడానికి అహరహం కృషి చేస్తూ.. ఇది మోదీ శకం అనే గుర్తింపును ప్రపంచమంతా సాధించిన మంచి పనివాడు,నిజమైన నాయకుడు.. మన ప్రధాన సేవకుడు నరేంద్ర మోదీ! 
 

ప్రజాధనం మేసేస్తూ... ప్రోటోకాల్ సేవలు అనుభవిస్తూ.. అవినీతి నేతలను భరిస్తూ.. పోషిస్తూ.. పార్టీ పెద్దలను మంచి చేసుకుంటూ... ప్రజలనూ అవినీతిలో భాగస్వాముల్ని చేస్తూ..  ఐదేళ్లూ హ్యాపీగా గడిపేయకుండా... అవినీతి ముక్త భారతానికి తపించడం.. మేకిన్ ఇండియా కోసం ప్రయాస పడడం... సూపర్ పవర్ గా దేశాన్ని తీర్చాలని కలలు గనడం ఒక్క మోదీకి మాత్రమే చెల్లింది. 

మోదీ వచ్చాకా దేశమాత సగర్వంగా తలెత్తుకుంది. ప్రపంచం అంతా ఇప్పుడు భారత్ వైపు చూస్తోంది.. మోదీ ఎన్నికల నాయకుడు కాదు.. ఓటు బ్యాంకు కోసం పాకులాడే రాజకీయ పాకుడురాయి కాదు! కేవలం రాజకీయ నాయకుడూ కాదు... అతడొక రాజకీయ శిఖరం. పార్టీని బట్టి.. సంక్షేమ పధకాల్ని బట్టి , ప్రలోభాలకు లోబడి కాకుండా... ఒక వ్యక్తిగా..శక్తిగా, నిజమైన భారత జయ పతాకగా మోదీ ఇవాళ అజేయంగా నిలబడ్డాడు. 

నా దేశానికి ప్రపంచంలో ప్రతిష్టను పెంచిన ఉత్కృష్ట వ్యక్తిత్వం మోదీ... ఈ దేశం ఉన్నన్నాళ్లూ మోదీ పేరు నిలబడుతుంది... వినపడుతుంది.. అధికార పత్రాల్లోనూ స్మారక చిహ్నాల్లోనూ కాదు... ప్రజల హృదయాల్లో! అదీ మోదీ ఘనత. ఇది ఈ స్వతంత్ర భారత దేశంలో మరే ప్రధానికి లేని, మరే రాజకీయ నాయకుడికీ దక్కని ఖ్యాతి! మోడీని ఎందుకు మెచ్చుకుంటున్నావు అంటే... నేను ఇప్పుడు వంద కారణాలు చెప్పగలను! 

వీటిలో ఏదీ వ్యక్తిగతం కాదు.. అన్నీ ఈ దేశ ప్రతిష్టను పెంచినవే! ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోయినవే! 
మోదీని అదేపనిగా విమర్శిస్తూ విద్వేష విషం కక్కేవాళ్ళు అందుకు రెండు మూడు కారణాలే చెప్పగలరు.. అవికూడా ఉహాజనితాలు.. అసత్య ఆరోపణలూ లేదా తమ వ్యక్తిగత నష్టాలూ!!     
రాజకీయాల్లోకి వచ్చిందే కోట్లు కూడబెట్టడానికి అన్నట్టుగా అక్రమార్జన చేసేవాళ్ళకి మోదీ నిజాయితీ తో ఆగర్భ శత్రుత్వం...

తన నిజాయితీ తనకే పరిమితం చేసుకుని ఊరికే కూర్చోకుండా ఆ ఇమేజ్ తో దేశమంతా అధికారంలోకి రావడం.. అందరినీ తనలాగే మడి కట్టుకోమనడం అనేకమందికి కంటగింపు ! 
తాను, తన పెళ్ళాం, తన తమ్ముడు, తన కొడుకు, తన మనవడు, తన కులం... ఇలా అవినీతికి వారసుల్ని పోగేసే దుష్టనేతలకు మోదీ ఒక పీడకల! 

నువ్వు తినకపోతే మానై.. మాకు తినిపించాల్సిందే అనే నీతి సూత్రాన్ని నిక్కచ్చిగా ఫాలో అయ్యే నేటి రాజకీయ చాణక్యులకు మోదీ మింగుడు పడని వెలక్కాయ!
తమ కోసమే దేశం అన్నట్టుగా స్వార్థం బలిసి ప్రతి చోటా ఊరి మీద పడి దోచేస్తున్న వారికీ  మోదీ శత్రువే!
ఒక త్యాగిగా.. యోగిగా, విరాగిగా ఉంటూ.. దేశ ప్రజలకు ప్రధాన సేవకుడిగా వ్యవహరిస్తూ.. భరతమాత ఋణం తీర్చుకుంటున్న జాతి ముద్దు బిడ్డ మోదీ...

నూటికి 90 శాతం మంది అవినీతిలో ఏదోవిధంగా భాగస్వామ్యం అయ్యేలా వ్యవస్థని అనేక ఏళ్లుగా దిగజార్చేసిన పాలకుల పాపాల ఫలితమే ఇవాళ్టి దుర్దశ! దీనిని నాలుగేళ్లలోనే మార్చి చూపిన ఘనుడు మోదీ... ఇవాళ సమాజంలో అవినీతి తగ్గింది... వ్యక్తుల స్థాయిలో అవినీతికి భాగస్వాములు కావడం చాలావరకు తగ్గింది. నిజాయితీగా పన్నులు కడుతూ.. నిజాయితీగా ఆర్జిస్తూ.. సగర్వంగా దేశమాతకి నమస్కరించగల పౌరుల సంఖ్య పెరిగింది. 

ఇది చాలు మోదీని నేను సమర్థించడానికి! నేటి రాజకీయ గంజాయి వనంలో మోదీ ఒక తులసిమొక్క... నేటి భారతాన అవినీతి రాజకీయ నేతల సమూహం మధ్య మెరిసిన ఒక ఆశాకిరణం! మోదీ ని చూసి నేను గర్విస్తున్నాను! వ్యక్తిగతంగా కష్టాలు, నష్టాలు కొన్ని ఎదురైనా సరే దేశం కోసం వాటిని సహించడంలో.. భరించడంలో ఒక ఆనందం ఉంది. అది రుచి చూపిన తొలి నాయకుడు మోదీ!  ఈ తరంలో ఉన్నందుకు.. మోదీ పాలనలో ఉన్నందుకు నేను గర్విస్తున్నాను! 

మరోసారి మోదీ గెలవొచ్చు... ఓడవచ్చు.. ఏదైనా కావచ్చు!! కానీ అతడు గెలిస్తే అది దేశం గెలుపు.. ఓడితే దేశం ఓటమి! అంతగా దేశంతో మమేకమైన వాడు మోదీ! అతడొక సంస్కారం.. అతడే ఒక సంస్కరణ... అతడే ఒక శాసనం.. అతడే ధర్మ నియంత! ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దేశానికి నేటి అవసరం మోదీ! 

ఇక చివరిగా నేను గతంలో చెప్పిందే... మళ్ళీ చెప్పి ముగిస్తాను... దేశానికి బాగుపడే యోగం ఉంటే మోదీ మళ్ళీ గెలుస్తాడు... లేదంటే  ఓడిపోతాడు ! తాను గెలవాలని మోదీ ఈ నాలుగేళ్లలో ఏదీ చేయలేదు... దేశాన్ని గెలిపించాలనే అన్నీ చేసాడు! జై హింద్.. జై భరతమాత!


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!