ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కన్నా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాగా వెనుకబడ్డారు. బుర్సన్ కోహ్న్ అండ్ వోల్ఫే విడుదల చేసిన ‘ఫేస్‌బుక్‌లో ప్రపంచ నేతలు’ నివేదిక ప్రకారం ట్రంప్ కన్నా రెట్టింపు ప్రజాదరణ మోదీకి లభిస్తున్నట్లు తెలుస్తోంది.

ఫేస్‌బుక్‌లో ప్రపంచ నేతలకు లభిస్తున్న ఆదరణ ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.ఈ నివేదిక ప్రకారం ప్రధాని మోదీకి 4.32 కోట్ల మంది, డొనాల్డ్ ట్రంప్‌కు 2.31 మంది ఫేస్‌బుక్ ఫాలోయర్లు ఉన్నారు.
కాంబోడియా ప్రధాన మంత్రి హున్ సేన్‌కు ప్రజాదరణ పెరగడంతో ఆయన ఐదో స్థానంలోకి దూసుకెళ్ళారు. ఆయనకు 96 లక్షల మంది ఫేస్‌బుక్ ఫాలోయర్లు ఉన్నారు.
ట్రంప్‌కు గత 14 నెలల్లో 20.49 కోట్ల కామెంట్స్, లైక్స్, షేర్స్ లభించగా, మోదీకి ఇదే కాలంలో 11.36 కోట్ల కామెంట్స్, లైక్స్, షేర్స్ లభించాయని ఈ నివేదిక తెలిపింది.
ఫేస్‌బుక్ క్రౌడ్‌టాంగిల్ టూల్ నుంచి డేటాను ఉపయోగించి 2017 జనవరి 1 నుంచి ఈ అధ్యయనాన్ని నిర్వహించినట్లు ఆ సంస్థ పేర్కొంది. 650 ఫేస్‌బుక్ పేజీలను విశ్లేషించినట్లు తెలిపింది.
వివిధ దేశాల అధినేతలు, ప్రభుత్వ అధినేతలు, విదేశాంగ మంత్రుల ఫేస్‌బుక్ పేజీలను పరిశీలించినట్లు వివరించింది. రోజుకు సగటు పోస్టులను పరిశీలించినపుడు మోదీ కన్నా ఐదు రెట్లు పోస్టులను ట్రంప్ చేసినట్లు తెలిపింది
Comments
Post a Comment