కర్ణాటక ఎమ్మెల్యేలు…శర్మ ట్రావెల్స్ లోనే ఎందుకు..? ఓనర్ ఎవరో తెలుసా..?
కర్ణాటక రాజకీయం సినిమాను తలపిస్తోంది. ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతున్న పరిస్థితులను గమనిస్తే అసలేం అర్థం కావడం లేదు.ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మ్యాజిక్ ఫిగర్ ను మించి, మెజార్టీ ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి ఛాన్స్ ఇవ్వకుండా సరిపడా ఎమ్మెల్యేలు లేని బీజేపీకి గవర్నర్ అవకాశం ఇవ్వడం సర్వత్రా విమర్శల పాలవుతోంది. ఎన్డీయే సర్కార్ గవర్నర్లను అడ్డుగా పెట్టుకుని రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుందోని, అధికార మదంతో ఎమ్మెల్యేలను కొనేందుకు పావులు కదుపుతోందిన జాతీయ స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
అతిపెద్ద పార్టీగా అవతరించిన వాళ్లకే మొదటగా అవకాశం ఇవ్వాలని భావించి ఉంటే, గతంలో గోవా,మణిపూర్, మేఘాలయ వంటి రాష్ట్రాల్లో తమ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అవకాశం ఇవ్వలేదు అనేది కాంగ్రెస్ నేతల వాదన. అమిత్ షా,మోదీ లు కలిసి దేశాన్ని అదోగతి పాలు చేసేందుకు రాజకీయాన్ని పావులా వాడుకుంటున్నారని ఆ పార్టీ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అతిపెద్ద పార్టీకే అవకాశం ఇవ్వాలని భావించి ఉంటే బలనిరూపణకు 15 రోజులు అవసరమా అంటూ ప్రశ్నిస్తున్నారు.ఈ 15 రోజుల్లోగా తమ బలాన్ని పెంచుకునేందుకు ఎమ్మెల్యేలను కొనేందుకే గవర్నర్ ఆర్ఎస్ఎస్,బీజేపీ ఏజెంట్ లా మారిపోయి యడ్యూరప్ప చేత ప్రమాణ స్వీకారం చేయించాడన్నది వారి వాదన.వారిదే కాదు, బీజేపీ అధిష్టానంతో పాటు, కర్ణాటక గవర్నర్ వాజుభాయ్ వాలా అనుసరిస్తున్న వైఖరిని గమనిస్తున్న ప్రతీఒక్కరికి ఇవే అనుమానాలు కలుగుతున్నాయి.
Comments
Post a Comment