తిరుమలలో స్వామి వారి గులాబి రంగు వజ్రం ఏమైంది ??
తిరుమలలో స్వామి వారి గులాబి రంగు వజ్రం ఏమైంది ??
టి.టి.డి ప్రధాన అర్చకులుగా పనిచేసిన రమణ దీక్షితులు గారు లేవనెత్తిన అనేక ఆరోపణలకు నిన్నటి రోజున ఈ.వో అనిల్ కుమార్ సింఘాల్ సమాధానమిస్తూ ఒక ఆరోపణకు విచిత్ర సమాధానాన్ని చెప్పారు.
మైసూరు మహారాజా స్వామి వారికి ఇచ్చిన హారంలో ఒక గులాబీ రంగు వజ్రం ఉండేదని కొన్ని సంవత్సరాల క్రితం అది అద్రుశ్యమైనదని, అదే వజ్రాన్ని కొంత కాలం క్రితం జెనివా లో వేలం వేసారని రమణ దీక్షితులు గారు ఆరోపిస్తే, 2001 లో జరిగిన బ్రహ్మోత్సవాలలో గరుడ సేవ రోజున భక్తులు విసిరిన చిల్లర నాణేలకు వజ్రం పగిలిందని, పగిలిన ముక్కల్లో కొన్ని అర్చకులకు దొరికాయని వాటిని దేవస్థానం భద్రపరచిందని రికార్డుల్లో రాశారని ఈ,వో గారు సమాధానమిచ్చారు.
వజ్రం పగలడం జరుగుతుందా ??
వజ్రం కఠినమైన పదార్ధమని, దాన్ని పగలగొట్టండం సాధ్యం కాదని, లేజర్ వంటి ఆధునిక సాంకేతికత తోనే వాటిని ముక్కలు చేయడం సాద్యమౌతుందని మనం చిన్నపటినుండి సైన్సు లో చదువుకున్నాం కదా ???
మరి, భక్తులు విసిరిన చిల్లర నాణేలకు వజ్రం పగిలి ముక్కలు కావడం సాధ్యమేనా ??
ఈ.వో గారు చెప్పినదాని ప్రకారం ఈ సంఘటన 2001లో జరిగింది. ఇక్కడ అనుమనిచదగ్గ విషయం ఏంటంటే 2004 వరకు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉంది. అంతే కాదు 2002-2003 వరకు తెలుగుదేశం పార్టీకి చెందిన పుప్పాల చలపతిరావు అనే వ్యక్తి టి.టి.డి చైర్మన్ గా ఉన్నారు, ఆ తరువాత అంటే 2003-2004 వరకు తెలుగుదేశం పార్టీకి చెందిన ఆదికేశవులు నాయుడు అనే వ్యక్తి టి.టి.డి చైర్మన్ గా ఉన్నారు.
2001 నుండి 2004 ఆ సమయంలో ఏమి జరిగింది ??
నిజంగానే స్వామి వారు వజ్రం విదేశాలకు తరలించేసారా ??
తాను చేసిన ఆరోపణలకు, విమర్శలకు కట్టుబడి ఉన్నానని ప్రకటించడమే కాక శ్రీవారి అలంకారానికి పాత నగలు ఎందుకు వాడటంలేదని, కొత్త నగలు మాత్రమే వాడడానికి కారణం ఏమిటని రమణ దీక్షితులు ప్రశ్నించారు.
ప్రధాన అర్చకులుగా పనిచేసిన వ్యక్తి చేసిన ఆరోపణలపై ఆధారాలతో కూడిన రికార్డులను చూపించి నిజాయితీ నిరూపించుకోకుండా బ్రాహ్మణులతో బ్రాహ్మణులతో ఎందుకు తిట్టిస్తున్నారు ??
అసలు విషయాన్ని పక్కనపెట్టి రమణ దీక్షితులపై ప్రతి దాడి చేయటమే లక్ష్యంగా టీటీడీలోని కొందరు, ప్రభుత్వంలోని మరికొందరు ఎందుకు పనిచేస్తున్నారు ??
Comments
Post a Comment