లష్కరే కమాండర్ షకూర్ కాల్చివేత

లష్కరే కమాండర్ షకూర్ కాల్చివేత

లష్కరే తొయబా ఉగ్రవాద సంస్థకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కుల్గాంలో ఆదివారంనాడు జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారత బలగాలు ఇద్దరు లష్కరే ఉగ్రవాదులను కాల్చిచంపగా, వీరిలో ఒకరిని లష్కరే తొయిబా కమాండర్ షకూర్‌గా గుర్తించినట్టు తెలుస్తోంది. 2015 నుంచి కశ్మీర్‌లో చురుకుగా పనిచేస్తున్న షకూర్ రాష్ట్రంలో పలు ఉగ్రవాద దాడుల ప్రధాన సూత్రధారిగా ఉన్నట్టు ఉన్నతాధికార వర్గాల సమాచారం. షకూర్‌ను మట్టుబెట్టడం ద్వారా లష్కరేకు కీలకదెబ్బ తగిలినట్టు చెబుతున్నారు. కుల్గాం ఎన్‌కౌంటర్‌లోనే లష్కరేకు చెందిన మూడో ఉగ్రవాది ఆయుధాలు, మందుగుండు సామగ్రితో సహా లొంగిపోయాడు.


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!