ఉగ్రవాద దేశం పాకిస్థాన్ కు షాక్..?
ఉగ్రవాద దేశం పాకిస్థాన్ కు షాక్..?
ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ కు గట్టి షాక్ తగలనుంది. పాకిస్థాన్ ను ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందించే దేశంగా పరిగణిస్తూ గ్రే లిస్టులో పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉగ్రవాదులకు ఆర్థికంగా సాయపడుతున్నందుకు గానూ ఎఫ్‌ఏటీథఎఫ్(ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్) పాకిస్థాన్ పై ఈ చర్య తీసుకోనున్నట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ నేపథ్యంలో పాక్ కు వ్యతిరేకంగా తీసుకుంటున్న ఈ నిర్ణయాన్ని అడ్డుకునేందుకు ఆ దేశ ఆర్థికశాఖ మంత్రి షంషేద్ రంగంలోకి దిగారు. పారిస్ లో జరుగుతున్న ఎఫ్‌ఏటీఎఫ్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
పాకిస్థాన్ లో ఉగ్రమూకలను ఏరివేయాలని దేశం తీవ్రంగా కృషిచేస్తున్నట్లు ప్లీనరీ సమావేశంలో షంషేద్ వెల్లడించారు. ఇందుకోసం పాక్ ప్రభుత్వం మెరుగైన చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
ఎఫ్‌ఏటీ ఎఫ్‌ని 1989లో స్థాపించారు. మనీ లాండరింగ్, ఉగ్రవాద మూకలకు ఆర్థిక సాయం నిరోధించడానికి ఎఫ్‌ఏఎఫ్‌టీ చర్యలు తీసుకుంటుంది. పాకిస్థాన్ ను ఉగ్రవాదులకు సాయం చేసే దేశంగా పరిగణించాలని ఫిబ్రవరిలో అమెరికా నిర్ణయించింది. ఈ నిర్ణయానికి యూకే, జర్మనీ, ఫ్రాన్స్ కూడా మద్దతిచ్చాయి.
2012 నుంచి 2015 వరకు పాకిస్థాన్ గ్రే లిస్టులో ఉంది. ఇప్పుడు మరోసారి పాక్ ను గ్రే లిస్టులో పెట్టాలా? వద్దా? అనే నిర్ణయంపై ఈ ఆరు రోజుల సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటికే ఉగ్రవాదుల్ని ఏరిపారేయాల్సిందిగా అమెరికాతో పాటు ఇతర దేశాలూ పాక్‌పై ఒత్తిడి తెచ్చాయి.
By sources
Comments
Post a Comment