రేషన్ డీలర్లకు నోటీసులు
తెలంగాణ ప్రభుత్వం
పౌరసరఫరాల శాఖ కార్యాలయం
సోమాజిగూడ, హైదరాబాద్ 500082
పత్రికా ప్రకటన : తేది: 28.06.2018
రేషన్ డీలర్లకు నోటీసులు
సస్పెన్షన్ ఉత్తర్వులు
మహిళా సంఘాల ద్వారా జూలై 5 నుండి 10వ తేదీవరకు
సరకుల పంపిణీ
స్థానిక పరిస్థితులను బట్టి పొడిగింపు
సమస్యలు, ఫిర్యాదుల కోసం కంట్రోల్ రూం
1967 టోల్ ఫ్రీ నంబర్, వాట్సప్ నంబర్ 7330774444
రేషన్ డీలర్లు బాధ్యతలను విస్మరించడం బాధాకరం
ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై జాయింట్ కలెక్టర్లతో
సుదీర్ఘంగా సమీక్షించిన
పౌరసరఫరాల శాఖ కమిషనర్ శ్రీ అకున్ సబర్వాల్
జులై ఒకటవ తేదీ నుండి రేషన్ డీలర్ల సమ్మె నేపథ్యంలో పేద ప్రజలకు ఎలాంటి ఇబ్బంది, అసౌకర్యం కలగకుండా నిత్యావసర సరుకుల పంపిణీకి అవసరమైన చర్యలను తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటోంది.
సమ్మె పేరుతో రేషన్ డీలర్లు పేదల ఆహార భద్రతకు ఆటంకం కలిగించడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.
నిర్దేశిత గడువులోగా సరుకుల కోసం డబ్బులు చెల్లించి ఆర్‌ఓ (రిలీజ్ ఆర్డర్) తీసుకోని డీలర్లకు ముందుగా నోటీసులు ఇచ్చి ఆ తరువాత సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేయాలని నిర్ణయించింది.
రేషన్ డీలర్లను తొలగించి వారీ స్థానంలో జూలై 5వ తేదీ నుండి మహిళా సంఘాల ద్వారా సరుకుల పంపిణీకి చర్యలు చేపట్టింది. ఈ ప్రక్రియలో పేదలకు సకాలంలో సరుకులు అందించేలా పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించింది.
ఇందులో భాగంగా పౌరసరఫరాలశాఖ కమిషనర్ శ్రీ అకున్ సబర్వాల్ ఎంసిహెచ్‌ఆర్‌డి లో గురువారంనాడు జాయింట్ కలెక్టర్లు, డిసిఎస్‌వోలు, డిఆర్‌డిఎ ప్రాజెక్టు అధికారులతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు.
అర్హులైన ఆహార భద్రత కార్డుదారులకు నిత్యావసర సరుకులు అందించడంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, ఈ నెల 5వ తేదీ నుండి పంపిణీని ప్రారంభించాలని ఈ సందర్భంగా కమిషనర్‌గారు అధికారులకు విజ్ఞప్తి చేశారు.
5 నుండి 10వ తేదీ వరకు సరుకుల పంపిణీని చేయాలని, స్థానిక పరిస్థితులను బట్టి అవసరమైతే గడువు పొడిగించాలని సూచించారు.
తెలంగాణ ప్రభుత్వ పేదల ఆహార భద్రత కోసం కిలో రూపాయి చొప్పున ప్రతినెల 2కోట్ల 75 లక్షల మందికి రేషన్ షాపుల ద్వారా బియ్యాన్ని సరఫరా చేస్తోంది. ఈ బియ్యాన్ని లబ్ధిదారులకు అందిచాల్సిన కనీస బాధ్యత డీలర్లపై ఉంది. కానీ డీలర్లు ఆ బాధ్యతను విస్మరించడం బాధాకరం. సమ్మెను విరమించాలని రేషన్ డీలర్లకు అనేకసార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది. అయినా కూడా వారి వైఖరిలో మార్పురాలేదు.
పేదలకు ఇబ్బంది కలగకుండా మహిళా సంఘాలు, అందుబాటులో ఉన్న దగ్గర ఎన్‌ఆర్ డీలర్ల ద్వారా సరుకుల పంపిణీని చేయాలని నిర్ణయించాం.
జిల్లా, మండల, గ్రామ రేషన్ షాపుల వారీగా మహిళా సంఘాలను గుర్తించడంలో పారదర్శక విధానాన్ని పాటించాలి.
గ్రామీణ ప్రాంతాల్లో డిఆర్‌డిఎ, పట్టణ ప్రాంతాల్లో మెప్మా అధికారులు పర్యవేక్షిస్తారు. రికార్డుల నిర్వాహణ కోసం మహిళా సంఘాలకు శిక్షణ ఇవ్వనున్నారు.
డీలర్‌షిప్ బాధ్యతలు తీసుకున్న మహిళా సంఘాలతో జులై 1వ తేదీన మీసేవ కేంద్రాల్లో అధికారులు డీడీల కట్టించాలి.
సరుకుల పంపిణీ కంటే ముందు ఆయా ప్రాంతాల్లో సరుకుల నిల్వ, పంపిణీ కోసం లబ్ధిదారులకు అందుబాటులో ఉండే విధంగా గ్రామా పంచాయతీ, ఐకెపి, కమ్యూనిటీ హాల్స్, యూత్ బిల్టింగ్‌లను గుర్తించాలి. వేయింగ్ మెషిన్లను సమకూర్చుకోవాలి. ఈ విషయంలో తూనికల కొలతాల శాఖ అధికారుల సహకారం తీసుకోవాలి.
ఆ తర్వాత పౌరసరఫరాల సంస్థ గోదాముల నుండి సరుకులను తరలించాలి. ఇందుకోసం రవాణ వాహనాలను, సరుకుల లోడింగ్ కోసం హమాలీలను సిద్ధం చేసుకోవాలి. కంట్రాక్టర్లతో మాట్లాడి ఎక్కువ మొత్తంలో వాహనాలను అందుబాటులో ఉంచుకోవాలి.
జిల్లా, మండల, గ్రామాస్థాయిలో పౌరసరఫరాలు, రెవెన్యూ, గ్రామీణాభివృద్ధిశాఖలు సమన్వయంతో పనిచేయాలి.
ఆయా ప్రాంతాల్లో రేషన్ సరుకులు ఎక్కడ నుంచి పంపిణీ చేస్తున్నారనే విషయాన్ని లబ్ధిదారులకు ముందుగానే సమాచారాన్ని అందజేయాలి.
సమస్యలు, ఫిర్యాదులు, సమన్వయం కోసం 24 గంటలు పనిచేసేలా రాష్ట్రస్థాయిలో పౌరసరఫరాల కేంద్ర కార్యాలయంలో కంట్రోల్ రూంను ఏర్పాటు చేస్తున్నాం.
1967 టోల్‌ఫ్రీ నెంబర్, వాట్సప్‌నెంబర్ 7330774444 అందుబాటులో ఉంచడం జరిగింది. క్షేత్రస్థాయిలో సరుకుల పంపిణీపై నిత్యం పర్యవేక్షణతో పాటు రికార్డుల నిర్వహణపై ప్రధానంగా దృష్టి సారించాలి.
మహిళా సంఘాలకు డీలర్ల బాధ్యతలు అప్పగించే క్రమంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా రేషన్ పంపిణీలో జిల్లాస్థాయిలో జాయింట్ కలెక్టర్, సబ్ డివిజన్ స్థాయిలో ఆర్‌డిఓ, మండల స్థాయిలో తహసీల్దార్, గ్రామ స్థాయిలో వీఆర్‌ఓలకు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించడం జరిగింది.
పౌరసరఫరాల శాఖ కార్యాలయం నుంచి జారీచేయబడినది
Comments
Post a Comment