ఈరోజు ప్రధానమంత్రి మోడీజీ తన నివాసంలో ప్రత్యేకంగా రైతులతో సమావేశమయ్యారు..
#రైతులకు భారీగా పెరగనున్న మధ్దతు ధరలు....
****************************************
ఈరోజు ప్రధానమంత్రి మోడీజీ తన నివాసంలో ప్రత్యేకంగా రైతులతో సమావేశమయ్యారు..
ఇటీవల చెరకు రైతుల కోసం కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ ఉపయోగాలను వారికి వివరించారు..
సుమారు 150 మంది రైతులు/రైతు ప్రతినిధులు ఉత్తరప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి ప్రధానిని కలిసి క్రృతజ్ఞతలు తెలపాలని లోకకల్యాణ్ మార్గ్‌లోని ఆయన నివాసానికి వచ్చారు..
ప్రధాని వారిని ఆప్యాయంగా స్వాగతించి వారితో విషయాలను పంచుకున్నారు..
ఈసందర్భంగా ప్రధాని వారికి తమ ప్రభుత్వం చేపట్టిన రైతు సంక్షేమ పధకాలను వివరించారు..
నీమ్‌కోటెడ్ యూరియా, ఫసల్‌భీమా యోజన, ఈ-నామ్ వగైరా పథకాలను వివరించడమే కాకుండా రైతుల ఆదాయాన్ని రెండింతలు చేయుటకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, అందుకై వారి సలహాలను కూడా పరిగణణలోకి తీసుకుంటుందని పేర్కొన్నారు..
ఈ ఖరీఫ్‌లో మరో వారం రోజుల్లో ప్రకటించనున్న మధ్దతు ధరలు రైతులకు సంతోషాన్ని కలిగిస్తాయని, ఒక పంట పండించడానికి రైతులకు అయ్యే ఖర్చు కన్నా #ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఉండేలా మధ్దతు ధరలు నిర్ణయిస్తామని హామీ ఇచ్చారు..
చెరకు మధ్దతు ధర కూడా మరో రెండు వారాల్లో ప్రకటిస్తామని తెలియజేశారు..
దేశీయ చక్కెర అవసరాలు 25 మిలియన్ మెట్రిక్ టన్నులు కాగా 2017-18 లో 32 మిలియన్ మెట్రిక్ టన్నుల చక్కెరను రైతులు ఉత్పత్తి చేశారని ఆయన వారిని కొనియాడారు..
Comments
Post a Comment