పార్టీ బలోపేతానికి విస్తృత చర్యలు జిల్లాలో బీజేపీ జన చైతన్య యాత్ర ఉత్సాహంలో కార్యకర్తలు నిజామాబాద్, కామారెడ్డి,
పార్టీ బలోపేతానికి విస్తృత చర్యలు
జిల్లాలో బీజేపీ జన చైతన్య యాత్ర
ఉత్సాహంలో కార్యకర్తలు
నిజామాబాద్, కామారెడ్డి,
కామారెడ్డి జిల్లాలో బీజేపీ పట్టు కోసం విస్తృత ప్ర చారం మొదలు పెట్టింది. ఇప్పటికే క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతానికై గ్రామ, మండల స్థాయిలో కమిటీ లను ఏర్పాటు చేసి చర్యలు చేపట్టారు. జిల్లాలో హిం దూత్వ సంస్థలు బలంగానే ఉండడంతో వచ్చే ఎ న్నికల్లో ఒకటి, రెండు నియోజకవర్గాల్లో పాగా వే సేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భా గంగానే సభలు, సమావేశాలు, బైక్ ర్యాలీలు, నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తూ రాష్ట్రా ప్రభుత్వాన్ని ఎండగడుతోంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం చే పడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీ సుకెళ్తున్నారు. శనివారం బీజేపీ జన చైతన్య యాత్ర జిల్లాలోకి ప్రవేశించనుంది. జిల్లాలో రెండు రోజుల పా టు జన చైతన్య యాత్ర సభలను నిర్వహించి బీజేపీ కార్యకర్తల్లో రాష్ట్ర నాయకులు మరింత ఉత్సహన్ని నింపనున్నారు.
కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలపై బలమైన క్యాడర్..
జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో బీజేపీ మంచి పట్టు ఉంది. ఈ నియోజకవర్గాల్లో క్షేత్ర స్థాయిలోను బలమైన క్యాడర్ ఉండడంతో గత ఎ న్నికల్లో అభ్యర్థులు పోటీలో నిలుచున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో హిందు సం స్థలు బలంగానే ఉన్నాయి. వీరి అండతో బీజేపీ గెలిచే అవకాశం ఉంది. కామారెడ్డి పట్టణంలోను బీజేపీకి మంచి క్యాడర్ ఉంది. మున్సిపాలిటిలో ప్రతీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందుతున్నారు. ప్రస్తుతం మున్సిపల్ పాలకవర్గంలో బీజేపీ నలుగురు కౌన్సిలర్లు ఉన్నారు. ఈ వచ్చే ఎన్నికల్లో కామారెడ్డి నియోజక వర్గంలో బీజేపీ జెండా ఎగురవేయాలని నాయకులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇటీవల మాజీ జడ్పీ చైర్మన్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి బీజేపీలో చేరి ని యోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నా యి. ఇందులో భాగంగానే వెంకటరమణారెడ్డి కామా రెడ్డి పట్టణంతో పాటు అన్ని మండలాల్లో కార్యక్రమా లు చేపడుతున్నారు. ఇటీవల భారీ బైక్ ర్యాలీ ని ర్వహించి అందరి దృష్టి తన వైపు మళ్లించుకున్నారు. మరో వైపు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాణాల లక్ష్మారెడ్డి కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలతో పాటు జిల్లా అంతట పర్యాటిస్తూ సమావేశాలు ని ర్వహిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండ గడుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు. గత ఎన్నికల్లో ఎల్లారె డ్డి నుంచి పోటీ చేసిన బాణాల లక్ష్మారెడ్డి మూడో స్థానంలో నిలిచారు.
జుక్కల్‌లో పాగా కోసం చర్యలు..
జుక్కల్ నియోజకవర్గంలోను బీజేపీ పాగా వేసేం దుకు నాయకులు కసరత్తు చేస్తున్నారు. నియోజకవ ర్గ పరిధిలో మహారాష్ట్ర వాతావరణం ఉండడంతో హి ందుత్వం బీజేపీకి కలిసి రానుంది. నియోజకవర్గం పై మరింత దృష్టి చెడితే క్యాడర్ మరింత బలోపేతం చే సుకోవచ్చనే ఆలోచనలో బీజేపీ ఉంది. ఈ నియోజకవ ర్గం ఎస్సీ రిజర్వు కావడంతో నాయుడు ప్రకాష్, రెవ న్నలు పోటీ చేసేందుకు అసక్తి చూపుతున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నారు.
జన చైతన్య యాత్ర..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ జన చైతన్య యాత్ర నిర్వహిస్తూ పా ర్టీని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. ఈ యాత్ర శనివారం జిల్లాలో ప్రవేశించనున్నది. రెండు రోజుల పాటు జిల్లా లో జన చైతన్య యాత్రను నిర్వహించనున్నారు. శని వారం సాయంత్రం కామారెడ్డి జిల్లాలో, ఆదివారం మ ద్నూర్‌లో బహిరంగ సభను నిర్వహించేందుకు బీజేపీ నాయకులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ పక్షనేత కిషన్‌రెడ్డి, మా జీ కేంద్ర మంత్రి ఎంపీ బండారి దత్తత్రేయతో పాటు కేంద్ర నాయకులు హాజరయ్యే అవకాశం ఉంది.
Comments
Post a Comment