అవిశ్వాసం వీగిపోవడం ఖాయం.. మాకు 314 మంది ఎంపీల మద్దతు: బీజేపీ
అవిశ్వాసం వీగిపోవడం ఖాయం.. మాకు 314 మంది ఎంపీల మద్దతు: బీజేపీ
ఈ నెల 20న లోక్‌సభలో మోదీ సర్కారుపై టీడీపీ పెట్టనున్న అవిశ్వాస తీర్మానం వీగిపోవడం ఖాయమని తెలుస్తోంది. స్పీకర్‌తో కలుపుకుని లోక్‌సభలో బీజేపీ బలం 274. ఎన్డీయేలోని జేడీయూ, లోక్‌జనశక్తి, శిరోమణి అకాళీదళ్‌తో పాటు చిన్నాచితకా పార్టీలు ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నాయి. ఎన్డీయేతర పార్టీల మద్దతు కూడా తమకు లభిస్తుందని బీజేపీ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఇప్పటివరకూ తమకు మద్దతిస్తోన్న ఎంపీలతో కలుపుకుంటే తమ బలం 314 అవుతుందని బీజేపీ అంటోంది.
టీఆర్ఎస్, శివసేన, బిజూ జనతాదళ్, అన్నాడీఎంకే ఇంకా తమ వైఖరిని స్పష్టం చేయలేదు. టీడీపీ పెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు ఇతర చిన్నా చితకా పార్టీల ఎంపీలు ఓటు వేయనున్నారు.
Comments
Post a Comment