నేను సంఘ విద్రోహ శక్తినా?
నేను సంఘ విద్రోహ శక్తినా?
తెలంగాణ ప్రభుత్వ విజ్ఞతకే వదిలేస్తున్నా!
ఇలాంటి చర్యలు నా పోరాటాన్ని ఆపలేవు
స్వామి పరిపూర్ణానంద
హైదరాబాద్ నుంచి బహిష్కరణకు గురైన శ్రీ పీఠం పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద తెలంగాణ ప్రభుత్వం తీరు పై తీవ్రంగా మండిపడ్డారు. సంఘ విద్రో హ శక్తిగా పేర్కొంటూ తనను బహిష్కరించడం ఎంతవరకూ సబబని ప్రశ్నించారు. 300 గ్రామాలను దత్తత తీసుకుని, వెనకబడ్డ ప్రాంతాలలోని పిల్లలకు సంధ్యా గురుకులం పేరిట దేశభక్తిని పెంపొందిస్తున్నానని, వందలాది గోవులు, గిత్తలు రైతులకు దానం చేసి గోఆధారిత వ్యవసాయానికి తోడ్పాటునందిస్తున్నానని వివరించారు. దీనికి ప్రతిగా సంఘ విద్రోహశక్తి నిర్వచనం ఇవ్వడాన్ని తెలంగాణ ప్రభుత్వ విజ్ఞతకే వదిలేస్తున్నట్లు పరిపూర్ణానంద చెప్పారు. కాకినాడ శ్రీపీఠంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇలాంటి చర్యలతో తన ధర్మపోరాటం ఆగిపోదని, దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో హిందూ ధర్మపరిరక్షణ కోసం పాటుపడతానని స్పష్టం చేశారు.
హిందూ మతంపై అనుచిత వ్యాఖ్యలు, దూషిస్తూ పుస్తకాలు రాసిన వారిపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని ఆయన అన్నారు. వేంకటేశ్వరస్వామి, సుప్రభాతాలపై బాబు గోగినేని పలు అనుచిత వ్యాఖ్యలు చేసినా పట్టించుకోని ప్రభుత్వం.. కత్తి మహేశ్‌ను బహిష్కరించడం సరికాదని అన్నారు. అనుచిత వ్యాఖ్యలకు దారితీసిన పరిస్థితులను గుర్తించాలని పేర్కొన్నారు. స్వామి పరిపూర్ణానందపై హైదరాబాద్ పోలీసులు 6నెలల పాటు నగర బహిష్కరణ విధించగా.. తాజాగా, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోకి 48 గంటల వరకు రావొద్దంటూ ఆయా కమిషనర్లు ఆయనకు నోటీసులు జారీచేశారు.
By sources
Comments
Post a Comment