హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో అయోమయ పరిస్థితి..!

హైదరాబాద్ మెట్రో స్టేషన్లలో అయోమయ పరిస్థితి..!

డిస్‌ప్లే బోర్డుల్లో అసంపూర్తి సమాచారం
హైదరాబాద్‌: మెట్రో రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసి డిస్‌ప్లే బోర్డులు ప్రయాణికులకు అర్థం కావడం లేదు. ఈ బోర్డుల్లో సమాచారం డిస్‌ప్లే అవుతున్నా.. రైళ్లు ఎటువైపు నుంచి వస్తున్నాయో తెలియడం లేదని అంటున్నారు. మెట్రో సేవలు అందుబాటులోకి రావడంతో నగరంలో ప్రజా రవాణా వ్యవస్థలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలు, అత్యాధునిక మౌలిక వసతులే కాదు సమయ పాలన మెట్రో రైళ్ల రాకపోకల్లో ఉంటోంది. అయితే కొన్ని మెట్రోస్టేషన్‌లలో ఉన్న డిస్‌ప్లే బోర్డుల్లో సమాచారం అసంపూర్తిగా ఉంటోంది. డిస్‌ప్లే బోర్డులపై సమయాన్ని సూచిస్తున్నా, అది ఎటువైపు నుంచి వస్తుందో తెలియక ప్రయాణికులు అయోమయానికి గురవుతున్నారు. సాధారణ రైల్వే స్టేషన్‌లలో రైళ్ల రాకపోకలపై ఉండే పబ్లిక్‌ అనౌన్స్‌మెంట్‌ వ్యవస్థ మెట్రోస్టేషన్‌లలో లేదు.
 
కేవలం మెట్రో ప్లాట్‌ఫాంపై ఏర్పాటు చేసిన డిస్‌ప్లే బోర్డులు చూసి తెలుసుకో వాల్సి ఉంటుంది. ఈ బోర్డులపై ఏర్పాటు చేస్తున్న సమయాలు అందరికీ సులభంగా అర్థం కావడం లేదు. చాలామంది రైలు ఎటు నుంచి వస్తుందో తోటి ప్రయాణికుల ను, మెట్రో సిబ్బందిని అడిగి తెలుసుకోవాల్సి వస్తోంది. ప్రస్తుతం 30 కి.మీ మెట్రో మార్గంలో రైళ్ల రాకపోకలు సాగిస్తూ, కచ్చితమైన సమయానికి వస్తూ నిర్ణీత కాలంలోనే ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరవేస్తున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో గంటకు పైగా పట్టే ప్రయాణం కేవలం 25 నుంచి 30 నిమిషాల్లోనే ముగుస్తోంది. దీంతో నగరవాసులు మెట్రోలో ప్రయాణం చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. కాగా మెట్రో స్టేషన్‌లలో ఏర్పాటు చేసిన డిస్‌ప్లే బోర్డులు ప్రయాణికులకు పూర్తి స మాచారాన్ని సూచించడం లేదు. మెట్రో అధికారులు పరిశీలించి ప్రయాణికులు సులభంగా అర్థమయ్యేలా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
By sources

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!