దుర్గమ్మకు కేసీఆర్‌ కానుకలపై పిటిషన్‌ విచారణకు స్వీకరించిన హైకోర్టు....

దుర్గమ్మకు కేసీఆర్‌ కానుకలపై పిటిషన్‌ విచారణకు స్వీకరించిన హైకోర్టు.....!

సీఎం  కేసియార్   కనకదుర్గ అమ్మవారికి సమర్పించిన వజ్రాల ముక్కుపుడకకు వెచ్చించిన రూ.5 కోట్ల సొమ్మును ప్రభుత్వ ఖజానాకు జమ చేసేలా ఆదేశాలు జారీ చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ఉమ్మడి హైకోర్టు విచారణకు స్వీకరించింది.

సికింద్రాబాద్‌కు చెందిన ప్రొఫెసర్‌ పి.ఎల్‌.విశ్వేశ్వరరావు దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్‌, జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

 పిటిషనర్‌ తరఫు న్యాయవాది మహమ్మద్‌ అబ్దుల్‌ ఖ్వావీ అబ్బాసీ వాదనలు వినిపించారు. దీనికి ఆధారాలేమిటని ధర్మాసనం ప్రశ్నించగా పత్రికల్లో కథనాలు వచ్చాయని న్యాయవాది చెప్పారు.

ఇదే వ్యవహారానికి సంబంధించి మరో పిటిషన్‌ పెండింగ్‌లో ఉందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్‌ ధర్మాసనం దృష్టికి తీసుకురాగా ప్రొఫెసర్‌ పి.ఎల్‌.విశ్వేశ్వరరావు పిటిషన్‌తో జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది..
By sources

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!