రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి కార్లకూ నంబర్లు ఉండాల్సిందే!

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితోపాటు గవర్నర్లు, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ల అధికారిక వాహనాలకు కూడా రిజిస్ట్రేషన్ నంబర్లు ఉండాల్సిందేనని ఢిల్లీ హైకోర్టు బుధవారం స్పష్టంచేసింది. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవాళ్ల వాహనాలపై కూడా జాతీయ చిహ్నం బదులు రిజిస్ట్రేసన్ నంబర్లు ఉండాలంటూ గతంలోనే ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇలా ప్రత్యేకంగా వాళ్ల వాహనాలపై నాలుగు సింహాల గుర్తు ఉండటం వల్ల వాళ్లను లక్ష్యంగా చేసుకోవడం సంఘ విద్రోహ శక్తులకు సులువవుతుందని ఈ పిటిషన్ వేసిన ఓ ఎన్జీవో వాదించింది. అంతేకాదు ఇలాంటి చిహ్నాలు ఉన్న కార్ల జోలికి పోలీసులు, ఇతర అధికారులు అస్సలు వెళ్లరు. దీనివల్ల కొందరు నేరస్థులు, ఉగ్రవాదుల తమ కార్యకలాపాల కోసం ఇలాంటి కార్లను వాడే ప్రమాదం కూడా ఉంది అని పిటిషన్ స్పష్టంచేసింది. రిజిస్ట్రేషన్ నంబర్ లేకపోవడం అంటే నిబంధనల ఉల్లంఘన జరగడంతోపాటు వాటికి ఇన్సూరెన్స్ లేదని కూడా స్పష్టమవుతుందని ఆ ఎన్టీవో తన పిటిషన్‌లో పేర్కొన్నది. విదేశాంగ శాఖ ఆధీనంలో ఉన్న 14 కార్లను రిజిస్టర్ చేయలేదన్న ఓ ఆర్టీఐ సమాచారం మేరకు ఈ పిటిషన్ దాఖలు చేశారు.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!