నేడు రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు: వీహెచ్‌పీ

నేడు రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు: వీహెచ్‌పీ 

 రాష్ట్ర ప్రభుత్వం పరిపూర్ణానంద స్వామీజీని నగరం నుంచి బహిష్కరించడం యావత్‌ హిందూ సమాజాన్ని తీవ్రంగా అవమానించడమేనని వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు అన్నారు. బుధవారం కోఠిలోని వీహెచ్‌పీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. పరిపూర్ణానంద స్వామీజీని నగర బహిష్కరణ చేయడాన్ని నిరసిస్తూ ఈనెల 19న తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రహదారుల దిగ్బంధం ఉంటుందని చెప్పారు. రాజ్యాంగాన్ని సంరక్షించడం ప్రభుత్వ విధి అని, ధర్మాన్ని రక్షించడం స్వామీజీల లక్ష్యమని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్వామీజీపై బహిష్కరణను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!