పాక్ అధ్యక్షుడి కుటుంబానికి నెహ్రూతో అనుబంధం

పాక్ అధ్యక్షుడి కుటుంబానికి నెహ్రూతో అనుబంధం

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ 'పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్' వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన డాక్టర్ ఆరిఫ్ అల్వి ఆ దేశ 13వ అధ్యక్షుడిగా ఎన్నికైన నేపథ్యంలో ఆయన కుటుంబానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగుచూసింది. డాక్టర్ ఆరిఫ్ అల్వి తండ్రి డాక్టర్ హబీబ్ ఉర్ రెహ్మాన్ ఇలాహి అల్వి వృత్తిరీత్యా  దంతవైద్యుడు. ఆయన భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు డెంటిస్ట్‌‌గా వ్యవహరించేవారు. ఇండియా నుంచి పాకిస్థాన్ విడిపోయిన తర్వాత ఆ దేశానికి డాక్టర్ అల్వి కుటుంబం వెళ్లిపోయింది. అల్వీ బయోగ్రపీని పీటీఐ పార్టీ వెబ్‌సైట్‌లో ఉంచింది. డాక్టర్ హబీబ్ ఉర్ రెహ్మాన్ ఇలాహి అల్వి భారత తొలి ప్రధాని నెహ్రూకు దేశ విభజనకు ముందు డెంటిస్ట్‌గా ఉండేవారని ఆ వెబ్‌సైట్ వెల్లడించింది. డాక్టర్ అల్వి కుటుంబానికి నెహ్రూ రాసిన లేఖలు కూడా తమ వద్ద ఉన్నాయని పేర్కొంది. కాగా, ఈనెల 8వ తేదీతో పదవీ విరమణ చేయనున్న పాక్ ప్రస్తుత అధ్యక్షుడు మమ్‌నూన్‌ హుస్సేన్‌‌ కుటుంబం ఆగ్రా నుంచి, పర్వేజ్ ముషర్రఫ్ తల్లిదండ్రులు న్యూఢిల్లీ నుంచి పాక్‌కు వలస వెళ్లినవారే.


Comments