బీజేపీలో రజినీకాంత్ పార్టీ విలీనం.!

బీజేపీలో రజినీకాంత్ పార్టీ విలీనం.!

రజినీకాంత్ .. దక్షిణాదిన ఆయన ఓ సంచలనం. ఆయన పార్టీ రాజకీయ గోదాలోకి దిగితే ప్రభంజనం ఖాయమని ఉప్పొంగిపోతుంటారు ఆయన ఫ్యాన్స్. తమిళనాట అంతగా తన అభిమాన సంపాదించారు. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వస్తున్న రజినీ.. తమిళనాడులో ప్రభావం చూపించగల నాయకుడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఆయన రాజకీయ ఆరంగేట్రంపై స్పష్టత ఉన్నా.. పార్టీ పేరు, గుర్తు లాంటివేవీ ఇంకా ప్రకటనకు నోచుకోలేదు. ఆయన పార్టీ ఇంకా పునాదుల స్థాయిలోనే ఉంది. పూర్తి స్థాయిలో పురుడు పోసుకోకముందే బీజేపీలో తన పార్టీని విలీనం చేయడానికి రజినీ రెడీ అవుతున్నారంటూ ఓ వార్తా కథనం జాతీయ మీడియాలో జోరుగా ప్రసారమవుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో రజినీ మంతనాలు జరిపినట్టు ఆ వార్తాకథనం సారాంశం. ఢిల్లీ వేదికగా ఇప్పటికే ఏడు సార్లు ఇద్దరూ కలిసి చర్చించినట్టు చెబుతున్నారు. అయితే ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందనే దానిలో అనేక సందేహాలున్నప్పటికీ... ఈ విషయాన్ని రజినీ ఫ్యాన్స్... అందునా తమిళులు ఎంతగా స్వాగతిస్తారో వేచిచూడాల్సిందే.


Comments