*నేడు ఉద్యోగ సంఘాలతో కేసీఆర్ భేటీ*
*నేడు ఉద్యోగ సంఘాలతో కేసీఆర్ భేటీ*
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు రోజురోజుకు వేగంగా మారుతున్నాయి. ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు జోరందుకున్న తరుణంలో అసెంబ్లీ రద్దుకు ముహూర్తం కూడా ఖరారు అయింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ మరో ముందడుగు వేశారు. బుధవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ ఉద్యోగ సంఘాలతో భేటీ కానున్నారు. కీలకమైన పీఆర్సీ, ఐఆర్ అంశాలపై నేడు వారితో చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈసారి 43 శాతం ఐఆర్ ను కోరుతున్నారు ఉద్యోగులు. గతంలో 27 శాతం ఐఆర్ ఇచ్చింది తెలంగాణ సర్కార్. ఈ రోజు జరిగే ఉద్యోగ సంఘాల సమావేశంలో కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గురువారం జరిగే కేబినేట్ సమావేశానికి ముందు నేడు ఉద్యోగ సంఘాలతో భేటీ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ముందస్తు ఎన్నికల నేపథ్యంలో గురువారం జరగనున్న కేబినేట్ భేటీకి రాష్ట్రంలోని మంత్రులు అందరు హైదరాబాద్‌లో ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. గురువారం ఉదయం 6 గంటలకు మొదలయ్యే కేబినేట్ భేటీ అనంతరం ఎన్నికలపై తుది ప్రకటన విడుదలైయే అవకాశం ఉంది.
Comments
Post a Comment