గుండె వేగాన్ని తెలిపే 'లెనొవో' కార్డియో ప్లస్ ఫిట్‌నెస్‌ బ్యాండ్ విడుదల

గుండె వేగాన్ని తెలిపే 'లెనొవో' కార్డియో ప్లస్ ఫిట్‌నెస్‌ బ్యాండ్ విడుదల

తమ వినియోగదారులకు చైనాకు చెందిన టెక్నాలజీ కంపెనీ లెనొవో తీపికబురు అందించింది. కార్డియో ప్లస్ హెచ్‌ఎక్స్‌వో3డబ్ల్యూ ఫిట్‌నెస్‌ బ్యాండ్‌, స్లీప్‌ ట్రాకర్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసినట్లు లెనొవో కంపెనీ ప్రకటించింది. లెనొవో ఫిట్‌నెస్‌ బ్యాండ్ రూ. 1,999కే అందుబాటులో ఉంటుందని, సెప్టెంబర్ 9వ తేదీ నుంచి అమెజాన్ ఇండియా ద్వారా కొనుగోలు చేయవచ్చని కంపెనీ పేర్కొంది. లైట్ సర్దుబాటు ఫీచర్స్, ఐపీ68 సర్టిఫైడ్ 1 మీటర్ వరకు వాటర్‌ను తట్టుకోగలదని, లెనొవో ఫిట్‌నెస్‌ బ్యాండ్ గుండె వేగాన్ని తెలుపుతుందని సంస్థ తెలిపింది. కొనుగోలుదారులు బ్లాక్, బ్లూ, రెడ్, ఆరంజ్ రంగు ఎంపిక చేసుకోవచ్చని సంస్థ వెల్లడించింది.


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!