మళ్ళీ ఆయనే సీఎం... తేల్చి చెప్పిన ‘ఇండియా టుడే’ సర్వే...
మళ్ళీ ఆయనే సీఎం... తేల్చి చెప్పిన ‘ఇండియా టుడే’ సర్వే...
ఛత్తీస్‌గఢ్‌లో అత్యధికులు సీఎం రమణ్ సింగ్‌కు గట్టి మద్దతు ప్రకటిస్తున్నారు. ‘ఇండియా టుడే’ నిర్వహించిన పొలిటికల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సర్వేలో పాల్గొన్నవారిలో 41 శాతం మంది రమణ్ సింగ్‌ను మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు.
ఛత్తీస్‌గఢ్ శాసన సభ ఎన్నికలు ఈ సంవత్సరాంతంలో జరిగే అవకాశం ఉంది. తాజా సర్వే ప్రకారం రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి మెరుగ్గానే కనిపిస్తోంది.
బీజేపీ నేత రమణ్ సింగ్ 2003 నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ‘ఇండియా టుడే’ సర్వే నివేదిక ప్రకారం ఆయన నాలుగోసారి కూడా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన మరోసారి ముఖ్యమంత్రి అవాలని కోరుకుంటున్నట్లు 41 శాతం మంది తెలిపారు. కాంగ్రెస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు భూపేశ్ బఘేల్‌ను తదుపరి సీఎంగా చూడాలనుకుంటున్నట్లు 21 శాతం మంది చెప్పారు.
రమణ్ సింగ్ ప్రభుత్వం పనితీరు పట్ల 39 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేయగా, 34 శాతం మంది మార్పును కోరుకుంటున్నట్లు చెప్పారని ఈ సర్వే పేర్కొంది.
టెలిఫోన్ ఇంటర్వ్యూల ద్వారా ఈ సర్వే నిర్వహించినట్లు ‘ఇండియా టుడే’ ప్రకటించింది. ఈ సర్వేలో 4,598 మంది తమ అభిప్రాయాలను తెలిపారని పేర్కొంది.
Comments
Post a Comment