గ్రామ పంచాయతీ ఎన్నికలను జనవరి10లోపు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది
గ్రామ పంచాయతీ ఎన్నికలను జనవరి10లోపు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. 2019, జనవరి, 3, 6, 8 తేదీల్లో మూడు విడతలుగా పంచాయితీ ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర సర్కారు యోచిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి ఆగస్టులోనే గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహించాలని ఏర్పాట్లు చేసినా.. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడింది.
దీంతో నిన్నామొన్నటి వరకు శాసన సభ ఎన్నికల కోసం అహర్నిశలు పనిచేసిన అధికారులు ఇప్పుడు మళ్లీ రంగంలోకి దిగారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం ప్రతిపాదనలను సిద్ధం చేసింది. మరో వైపు 60 శాతం రిజర్వేషన్లు సాధనపై మరోసారి హైకొర్టును ఆశ్రయించాలని భావిస్తుంది. ఇప్పటికే బ్యాలెట్ బాక్స్‌లు, పత్రాలు సిద్ధం చేశారు. 60 శాతం రిజర్వేషన్ల సాధనపై సర్కారు ప్రయత్నం చేస్తుంది. అన్ని పంచాయతీలకు ఎన్నికల నిర్వహించాలన్న కోర్టు ఆదేశాలను పాటించేందుకు కసరత్తు చేస్తున్నారు.
Comments
Post a Comment