ఘనంగా ప్రారంభమైన జాతీయ పుస్తక ప్రదర్శన
హైదరాబాద్: హైదరాబాద్ మహానగరం జాతీయ స్థాయి పుస్తకాల పండుగకు మరోసారి వేదికైంది. ఈ రోజు నుంచి ప్రారంభమై.. 25వ తేదీ వరకు 32వ జాతీయ పుస్తక ప్రదర్శన కొనసాగనుంది. హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ తెలంగాణ కళాభారతి (ఎన్టీఆర్ స్టేడియం)లో పదకొండు రోజుల పాటు నిర్విరామంగా కొనసాగనుంది. ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. ఈ వేడుకలో దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ర్టాలు పాల్గొన్నాయి. 330 స్టాల్స్‌తో పలువురు పబ్లిషర్స్ పాల్గొన్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, మరాఠీ, హిందీ, ఉర్దూ, సంస్కృతం, ఆంగ్ల భాషకు సంబంధించిన ఎన్నో భాషల పుస్తకాలు ఈ ఉత్సవంలో భాగంగా అందుబాటులోకి వస్తున్నాయి. తెలుగు భాషకు సంబంధించి విశాలాంధ్ర, నవ తెలంగాణ, నవ చేతన, ఎమెస్కో, జైకో, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలుగు అకాడమీ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం వారి పుస్తకాలు ప్రదర్శనలో అందుబాటులో ఉన్నాయి. అన్నిరకాల పుస్తకాలు ఒకేచోట..అన్ని రకాల పుస్తకాలు ఒకేచోట లభ్యమయ్యే సదవకాశం పాఠకుల ముంగిట్లోకి వచ్చింది. ప్రత్యేకంగా సాహిత్యానికి సంబంధించి ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేశారు. అన్నిరకాల పుస్తకాలు ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేక డిస్కౌంట్‌తో పబ్లిషర్లు పుస్తకాల్ని విక్రయించనున్నారు.సాంస్కృతిక కార్యక్రమాలు.. జాతీయ పుస్తక ప్రదర్శనలో భాగంగా ప్రతీరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు బాల బాలికలకు పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. చిత్రలేఖనం పోటీలు, బృంద నృత్య పోటీలు, బృందగాన పోటీలు, సోలో పాటల పోటీలు, ఒక్క నిమిషం తెలుగు, ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు, నృత్య పోటీలు, బాలల ఇంద్రజాల పోటీలు, క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నారు. పలు అంశాలపై బాలబాలికలకు వర్క్‌పాపులు నిర్వహిస్తున్నారు. బుక్ ఫెయిర్ ప్రాంగణం చుట్టూ ఎనిమిది సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
By source 
Comments
Post a Comment