పదో తేదీలోపే పంచాయతీ ఎన్నికలు: నాగిరెడ్డి

పదో తేదీలోపే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నాగిరెడ్డి వెల్లడించారు. జనవరి 10లోపే ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలిచ్చిందని తెలిపిన ఆయన న్యాయస్థానం ఆదేశాల మేరకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రిజర్వేషన్ల ఖరారుకై కొంత సమయం కోసం కోర్టుకు విజ్ఞప్తి చేశామన్నారు. కొన్ని రోజుల క్రితమే రిజర్వేషన్లపై కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. రిజర్వేషన్ల ఖరారు తరువాత చట్టప్రకారం ఎన్నికల నిర్వహణకు కొంత సమయం కావాలన్నారు. ఈ నెల 27 నుంచి జనవరి 2వ తేదీ మధ్యలో ప్రిసైడింగ్ ఆఫీసర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహిస్తామని చెప్పారు. నోటిఫికేషన్ తరువాత 15 రోజులకు మొదటి విడత ఎన్నికలు జరుగుతాయన్నారు. నోటిఫికేషన్ తరువాత 23 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి అవుతుందన్నారు. ఒక్కో విడతకు మధ్య 4 రోజుల సమయం ఉంటుందని తెలిపారు.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!