లోక్‌స‌భ‌లో ట్రిపుల్ త‌లాక్‌పై చ‌ర్చ‌

అత్యంత వివాదాస్ప‌ద‌మైన ట్రిపుల్ తలాక్ బిల్లుపై ఈనెల 27వ తేదీన చ‌ర్చ చేప‌ట్ట‌నున్నారు. ముస్లిం వుమెన్ ప్రొటెక్ష‌న్ బిల్లుపై ఆ రోజున లోక్‌స‌భ‌లో చ‌ర్చ జ‌ర‌గ‌నున్న‌ది. ఆ బిల్లుపై చ‌ర్చించాల‌ని కాంగ్రెస్ ఎంపీ మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే ఇవాళ స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్‌ను కోరారు. ట్రిపుల్ త‌లాక్ బిల్లుపై అభిప్రాయాలు వెలుబుచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉంద‌ని ఆయ‌న తెలిపారు. ఆ స‌మ‌యంలో కేంద్ర న్యాయ‌శాఖ మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ స్పందించారు. స‌భ శాంతియుతంగా జ‌రిగేందుకు అవ‌కాశం ఇస్తే, క‌చ్చితంగా ట్రిపుల్ త‌లాక్‌పై చ‌ర్చిస్తామ‌న్నారు. ట్రిపుల్ త‌లాక్ బిల్లుకు వ్య‌తిరేకంగా తీర్మానాన్ని వేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు ఎంపీ ఎన్‌కే ప్రేమ్‌చంద్రన్ తెలిపారు.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!