హైదరాబాద్‌లో బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. అంతేసంగతులు!
నగరంలో వరుస తనిఖీలతో జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్ అధికారులను పరుగులు పరిగెట్టిస్తున్నారు. ఫిలింనగర్, లోటస్‌పాండ్, ఎమ్మెల్యే కాలనీలలో బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఆయన.. అక్కడికక్కడే చర్యలు తీసుకున్నారు. రోడ్డుపై నీటిని వదిలినందుకుగాను బంజారాహిల్స్ అపోలో హాస్పిటల్‌పై రూ.2లక్షలు జరిమానా విధించారు. ఇవాళ సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. స్థానిక సెయింట్ అన్స్ పాఠశాల ఎదురుగా ఉన్న రోడ్డుపై భవన నిర్మాణ వ్యర్ధాలు ఉండటంతో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వ్యర్థాలు వేసిన వాణిజ్య భవనానికి పదివేల రూపాయల జరిమానా విధించారు. ఇదిలా ఉంటే బహిరంగ మూత్ర విసర్జన చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులను దాన కిషోర్ ఆదేశించారు. మొత్తానికి చూస్తే ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేసేవారిపై జీహెచ్ఎంసీ కఠిన చర్యలకు దిగనుందని తెలుస్తోంది.
Comments
Post a Comment