పులి ఇంకా బతికే ఉంది: శివరాజ్ చౌహాన్



పులి ఒక అడుగు వెనక్కి వేసిందంటే నాలుగు అడుగులు ముందుకు దూకడానికేనని చెబుతుంటారు. ఇవాల్టి ఓటమి రేపటి గెలుపునకు బాటేనని కొందరు బలంగా నమ్ముతుంటారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏమాత్రం చలించినట్టు కనిపించడం లేదు. 'టైగర్ అభీ జిందా హై' అంటూ ఆయన కార్యకర్తలు, ప్రజల్లో తిరిగి ఉత్సాహం నింపుతున్నారు.
 
మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి కమల్‌నాథ్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల పాల్గొని తన 'క్రీడాస్ఫూర్తి'ని చాటుకున్నారు. ఇదే ఉత్సాహాన్ని తన నియోజకవర్గంలోనూ చౌహన్ చాటుకున్నారు. బుధ్ని నియోజకవర్గంలో బుధవారం పర్యటించిన శివరాజ్ సింగ్ చౌహాన్...తాను ప్రజలతోనే ఉన్నానని, వారికోసమే పని చేస్తానని చెప్పారు. 'ఇప్పుడు ఏం జరిగిందని? ఎవరూ వర్రీ కావద్దు. నేను ఇక్కడే ఉన్నాను. టైగర్ బతికే ఉంది (టైగర్ అభీ జిందా హై) ' అని ఆయన తన నియోజకవర్గం ప్రజల్లో ఉత్సాహం నింపారు. 'బీజేపీ ఓడిపోలేదు. ఓట్లు పెరిగినప్పటికీ కొన్ని సీట్లు వెనకబడిందంతే. అభివృద్ధి విషయంలో వారికి (అధికార పార్టీ) మా మద్దతు ఉంటుంది. ప్రజలను ఇబ్బందులు పెడితే మాత్రం జనం వెంటే ఉండి పోరాడతాం' అని శివరాజ్ సింగ్ తెలిపారు.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!