తెలంగాణ మంత్రివర్గ ఏర్పాటుపై క్లారిటీ వచ్చేసింది!
తెలంగాణ సీఎంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే మంత్రి వర్గం ఎప్పుడు ఏర్పాటవుతుంది..? మంత్రి పదవులు ఎవరెవర్ని వరిస్తాయి..? పదవి దక్కించుకునే అదృష్టవంతులెవరు.? కేసీఆర్ ఎవరికి షాక్ ఇవ్వబోతున్నారు..? ఇలా పలు విషయాలపై తెలుగు ప్రజల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే ఈ మొత్తం వ్యవహారంపై ఆదివారం రాత్రి కాసింత క్లారిటీ వచ్చింది.
కేసీఆర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వారంలోపే మంత్రి వర్గం ఏర్పాటవుతుందని.. ప్రమాణం చేయబోయే మంత్రులు వీరేనని నెట్టింట్లో ఓ జాబితా పెద్ద ఎత్తున హల్‌చల్ చేసింది. అయితే డిసెంబర్ నెలలో మంత్రివర్గ ఏర్పాటు లేనట్టేనని తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ముహూర్తం కుదరకపోవడం, కేబినెట్‌లోకి ఎవరెవర్ని తీసుకోవాలనే దానిపై కసరత్తు జరుగుతుండటంతో ఈ నెలలో కుదరదని.. కొత్త ఏడాదిలో(2019 జనవరి) మంత్రివర్గ ఏర్పాటు ఉంటుందని సమాచారం. అసెంబ్లీ సమావేశాలు, ఎమ్మెల్యేల చేత ప్రమాణాలు అన్నీ జనవరి నెలలోనే ఉంటాయని తెలుస్తోంది. మరోవైపు కేసీఆర్‌కు వరుస కార్యక్రమాలు, ముహూర్తాలు లేని కారణంగా వచ్చేనెలకు వాయిదా వేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
Comments
Post a Comment