హనుమంతుడు ముస్లిమే... బీజేపీ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు..
హనుమంతుడి నేపథ్యంపై సాగుతున్న రాజకీయ పోరు ఇవాళ మరో కొత్త మలుపు తిరిగింది. హనుమంతుడు ముస్లిమేనంటూ ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్సీ బుక్కల్ నవాబ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లిం పేర్లన్నీ దాదాపు ‘‘హనుమాన్’’ పేర్లను పోలి ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ‘‘హనుమాన్ ముస్లిం అని నేను బలంగా నమ్ముతాను. ఎందుకంటే ముస్లిం ప్రజల పేర్లు దాదాపు హనుమంతుడికి దగ్గరగా ఉంటాయి. రహ్మాన్, రంజాన్, ఫర్మాన్, జీషాన్, ఖుర్బాన్ ఇలాంటి పేర్లన్నీ హనుమాన్‌కు సరిపోతున్నాయి. అందునా ఇలాంటి పేర్లన్నీ ఇస్లాంలో మాత్రమే కనిపిస్తాయి..’’ అని నవాబ్ చెప్పుకొచ్చారు. ఈ పేర్లన్నీ హనుమంతుడి నుంచే వచ్చాయనీ... ఆయనే లేకుంటే అసలు ఈ పేర్లే ఉండేవి కాదని సదరు ఎమ్మెల్సీ పేర్కొనడం విశేషం.
Comments
Post a Comment