వాయిదా పడ్డ పంచాయతీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల తరువాత నిర్వహించేoదుకు ప్రభుత్వ నిర్ణయం : *3 విడతల్లో పంచాయతీ*
*బ్రేకింగ్ న్యూస్*
వాయిదా పడ్డ పంచాయతీ ఎన్నికలు
పార్లమెంట్ ఎన్నికల తరువాత నిర్వహించేoదుకు ప్రభుత్వ నిర్ణయం
: *3 విడతల్లో పంచాయతీ*
పార్టీ రహితంగా ఎన్నికలు.. స్వతంత్ర గుర్తుల కేటాయింపు
ఇప్పుడు కూడా బ్యాలెట్‌తోనే.. 1.15 లక్షల వార్డులు గుర్తింపు
నాలుగైదు రోజుల్లో రిజర్వేషన్లు ఖరారు.. ఎన్నికల రోజే ఫలితాలు
హైదరాబాద్, రాష్ట్రంలో పంచాయతీలు, వార్డులు పెద్ద ఎత్తున ఉన్నందున ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. మూడు విడతలుగా ఎన్నికలు జరపడమే మేలన్న భావనలో ఉంది. అలాగే, గ్రామ పంచాయతీ ఎన్నికలు బ్యాలెట్ పేపర్‌పైనే జరగనున్నాయి. 2013లో పంచాయతీ ఎన్నికలను బ్యాలెట్ పత్రాలపైనే నిర్వహించారు. ఇప్పుడు కూడా ఆ పద్ధతినే పాటిస్తున్నారు. అప్పట్లాగే పార్టీరహితంగా ఎన్నికలు జరుగుతాయి. అంటే, పోటీ చేస్తున్న అభ్యర్థులకు స్వతంత్ర గుర్తులను కేటాయిస్తారు. ముద్రణకు అవసరమైన బ్యాలెట్ పేపర్‌ను ఇప్పటికే సమకూర్చుకున్నారు. ఎన్నికల నిర్వహణకు దాదాపు 1.15 లక్షల పోలింగ్ కేంద్రాలను గుర్తించారు.
పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లన్నింటినీ డిసెంబరు 31లోపు పూర్తి చేసేలా ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాచరణను ముమ్మరం చేశాయి. ఈ మేరకు జిల్లాల పంచాయతీ అధికారులు, ఇతర అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్‌ఈసీ ఆదేశించింది. పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్లను ఖరారు చేయడంలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా అమలుచేసేలా పంచాయతీరాజ్ చట్టానికి సవరణ తెస్తూ ఇటీవల ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో, 2013 నాటి రిజర్వేషన్ మార్గదర్శకాల్లో మార్పులు అనివార్యమయ్యాయి. వాటి రూపకల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు. దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు పోను మిగిలిన సీట్లను బీసీలకు కేటాయిస్తారు.
Comments
Post a Comment