20 రాష్ట్రాల్లో 100 ర్యాలీల్లో పాల్గోనున్న మోదీ

లోక్‌సభ ఎన్నికల వేడి రగిల్చేందుకు ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా విస్తృతంగా ర్యాలీలు చేబట్టనున్నారు. ఎన్నికల తేదీలు ప్రకటించక ముందే ప్రధాని వరుస ర్యాలీలతో బీజేపీని విజయతీరాలకు చేర్చాలనే పట్టుదలతో ఉన్నారు. ఈనెల 3 నుంచి ఆయన పార్టీ ప్రచార ర్యాలీలకు శ్రీకారం చుట్టనున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా 20 రాష్ట్రాల్లో 100కు పైగా ర్యాలీల్లో పాల్గోనున్నారు.
 
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో సాధించిన విజయాలను ప్రధానంగా ప్రజల ముందుకు  ఈ ర్యాలీలతో మోదీ తీసుకువెళ్తారని, కార్యకర్తలు, నేతల్లో ఉత్సాహం నింపి మరోసారి బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ ద్వితీయార్థం లేదా మే మొదట్లో దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి.


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!