26 మంది ఎంపీల సస్పెన్షన్

అన్నా డీఎంకే ఎంపీలపై లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ బుధవారం కఠిన చర్యలు తీసుకున్నారు. సభ కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నందుకు వరుసగా ఐదు రోజులపాటు లోక్‌సభ సమావేశాల్లో పాల్గొనకుండా సస్పెండ్ చేశారు. ఆ పార్టీకి చెందిన 26 మంది ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేశారు.
 
కావేరీ నదిపై కర్ణాటకలో మేకదాటు ఆనకట్టనునిర్మించాలని ప్రతిపాదించడంపై అన్నా డీఎంకే ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. లోక్‌సభ వెల్‌లోకి ప్రవేశించి, నినాదాలు చేశారు. తమను సస్పెండ్ చేయడంపై ఆ పార్టీ నేత తంబిదురై మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్నాయని, కర్ణాటకలో కొన్ని సీట్లు గెలవాలని బీజేపీ కోరుకుంటోందని, అందుకే మేకదాటు ఆనకట్ట నిర్మాణానికి అనుమతించారని ఆరోపించారు. నిరసన తెలియజేయడం తమకుగల ప్రజాస్వామిక హక్కు అని తెలిపారు. ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.

Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!