భీమ‌వ‌రంలో తెలంగాణ మాజీ మంత్రి..! పందేల కోస‌మా..? ప‌ంతాల కోస‌మా..?

భీమ‌వ‌రంలో మాజీ టీ మంత్రి త‌ల‌సాని..! పందేల‌కా..? ప‌ంతానికా..?
మాజీ మంత్రి, సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్ ఏపీ కి బయలుదేరి వెళ్లనున్నారు. ఆయన హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గం ద్వారా విజయవాడకు చేరుకుంటారు. సమీపంలోని ఇబ్రహీంపట్నం నుంచి స్థానిక యాదవ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా ఇంద్రకీలాద్రి వరకు వెళతారు. కనక దుర్గను దర్శించుకుంటారు. అనంతరం విజయవాడ నుండి భీమవరం చేరుకుని అక్కడి ప్రసిద్ధ మావురాలమ్మ దేవాలయాన్ని సందర్శిస్తారు. రాత్రికి అక్కడే విశ్రాంతి తీసుకుని ఉభ‌య‌గోదారి జిల్లాల ఆతిద్యాన్ని ఆస్వాదించ‌నున్నారు త‌ల‌సాని
ఏపి ప్ర‌జ‌ల మూడ్ తెలుసుకునే ప్ర‌య‌త్న‌మా..? లేక గోదావ‌రి రుచుల కోస‌మా..?
ఐతే తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు జోక్యం చేసుకున్నారు కాబ‌ట్టి ఏపి రాజ‌కీయాల్లో తాము కూడా జోక్యం చేసుకుంటామ‌ని మొద‌టినుండి చెప్పుకొప్తున్న గులాబీ పార్టీ నేత‌ల ప్ర‌క‌ట‌న‌లు కొంత రాజ‌కీయ ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు తావిస్తోంది. ఇలాంటి త‌రుణంలో తెలంగాణ నేత‌ల ఏపి ప‌ర్య‌ట‌న ప‌లు సందేహాల‌కు క‌లిగిస్తోంది. చంద్ర‌బాబు పై పైచేయి సాధించేందుకు పంతంప‌ట్టి ఏపిలో పర్య‌టిస్తూ ప్ర‌జ‌ల మూడ్ ను డైవ‌ర్ట్ చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారా..? లేక ప్రతియేటా కోడి పందేల‌కు మ‌రిగిన మ‌న‌సుని అదుపులో పెట్టుకోలేక ఆంద్రా లో ప‌ర్య‌టిస్తున్నారా అనేది ఆస‌క్తిగా మారింది. మ‌రి గుళ్లు, గోపురాల పేరుతో మ‌జీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్ చేసే ఏపీ ప‌ర్య‌ట‌న ఎలాంటి ప‌రిణామాల‌కు దారితీస్తుందో చూడాలి..!


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!