తలుపులు తెరిచే ఉన్నాయి... ఏ పార్టీతో పొత్తుకైనా సిద్ధమే : మోదీ

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజకీయ పొత్తుల గురించి మాట్లాడారు. తమిళనాడు పార్టీలతో పొత్తు కుదుర్చుకోవడానికి బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. అందరి కోసం తలుపులు తెరిచే ఉన్నాయన్నారు. బీజేపీకి సొంతంగా ఆధిక్యత వచ్చినపుడు కూడా మిత్ర పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికే ప్రాధాన్యమిచ్చామని తెలిపారు. పాత మిత్రులను గుర్తుంచుకుంటామని చెప్పారు. అన్ని రాజకీయ పార్టీల కోసం తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయన్నారు.
 
తమిళనాడులోని అన్నాడీఎంకే పార్టీతో పొత్తు కోసం బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. తమిళనాడులోని ఐదు జిల్లాల బీజేపీ కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!