గ్రౌండ్ ఇచ్చేందుకు కేంద్రం ఓకే
హైకోర్టుకు తెలిపిన ఏఏజీ, రిట్లపై 29న విచారణ
సచివాలయం, అసెంబ్లీ భవనాల కోసం బైసన్ పోలో గ్రౌండ్స్‌ను కేటాయించే ప్రతిపాదనకు సంబంధించిన కేసులను జనవరి 29న విచారణకు వేయాలని హైకోర్టు.... రిజిస్ట్రీని ఆదేశించింది. ఆ గ్రౌండ్స్ ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా ఉందని, దీనిపై దాఖలైన కేసులను వినాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్(ఏఏజీ) జె. రామచంద్రరావు గురువారం హైకోర్టు ధర్మాసనాన్ని కోరారు. ఏఏజీ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ధర్మాసనం...ఈ వ్యాజ్యాలను జనవరి 29న విచారణకు వేయాలంటూ రిజిస్ట్రీని ఆదేశించింది.
Comments
Post a Comment