కొత్త ఏడాదిలో మరింత తగ్గిన పెట్రోల్ ధర
కొత్త ఏడాదిలో ఇంధన ధరలు మరింత దిగొచ్చాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుతుండటంతో గత కొన్ని రోజులుగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. ఈ ఏడాది తొలిరోజున కూడా ఇంధన ధరలు మరికాస్త తగ్గాయి. దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 19 పైసలు తగ్గి రూ. 68.65గా ఉంది. లీటర్ డీజిల్ ధర కూడా 20 పైసలు తగ్గి 62.66గా ఉంది.
ఇక ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 74.30, కోల్‌కతాలో రూ. 70.78, చెన్నైలో రూ. 71.23, హైదరాబాద్‌లో రూ. 72.82గా ఉంది. ఇక డీజిల్ ధర ముంబయిలో లీటర్‌కు రూ. 65.56, కోల్‌కతాలో రూ. 64.42, చెన్నైలో రూ. 66.15, హైదరాబాద్‌లో రూ. 68.11గా ఉంది.
రూపాయి పతనం, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో గతేడాది ఆగస్టు-సెప్టెంబరు కాలంలో చుక్కలను తాకిన ఇంధన ధరలు.. ఆ తర్వాత అక్టోబరు 18 నుంచి తగ్గుముఖం పట్టాయి. తాజాగా ఏడాది కనిష్ఠానికి పడిపోయాయి.
Comments
Post a Comment