కూల్‌డ్రింక్‌ల కన్నా అన్నమే ప్రమాదం?

అన్నం.. దాదాపు 200 కోట్ల మందికి ప్రధాన ఆహారం. 100 కోట్ల మందికి జీవనాధారం. భారత్‌, చైనా లాంటి దేశాల్లో శతాబ్దాలుగా ఆకలి తీర్చే అమృతం. ఇప్పుడు అదే విషంగా మారుతోందా? రక్తంలో చేరి రక్కసిలా పీడిస్తోందా? చాపకింద నీరులా మనిషిని కుంగదీస్తోందా? అంటే అవుననే అంటున్నాయి తాజా అధ్యయనాలు. కూల్‌డ్రింక్‌ల కన్నా అన్నమే ఎక్కువ ప్రమాదం అని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. మధుమేహ వ్యాధి రావడానికి ఇది ప్రధాన కారణమవుతోందని చెబుతున్నాయి. బియ్యం తెల్లగా మెరవడానికి మిల్లుల్లో పాలిష్‌ చేయడం వల్ల ఉన్న పోషకాలన్నీ తౌడుగా మారిపోతున్నాయి.
 
అలా పాలిష్‌ పెట్టిన బియ్యాన్ని మనం తినడం వల్ల పోషకాలు శరీరానికి అందక కేవలం గ్లూకోజ్‌ రూపంలో చక్కెర మాత్రమే రక్తంలో కలుస్తోంది. ఇది అంతకంతకూ పెరిగి చివరికి మధుమేహానికి దారితీస్తోందని హార్వర్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ శాస్త్రవేత్తలు వెల్లడించారు. పరిశోధకులు చైనా, జపాన్‌, అమెరికా, ఆస్ట్రేలియాలోని 3.5 లక్షల మందిని 20 ఏళ్ల పాటు పరీక్షించగా రోజూ ఒక కప్పు అన్నం తిన్న వారిలో వ్యాధి వచ్చే రేటు 11 శాతం పెరిగిందని పేర్కొన్నారు. అయితే, చిన్న కూల్‌డ్రింక్‌లోనైనా చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటుందని, అలాంటిది అన్నా న్ని కూల్‌డ్రింక్‌ కంటే ప్రమాదమని చెప్పడాన్ని పలువురు ఖండిస్తున్నారు.
 
దొడ్డు బియ్యమే మేలు
బ్రౌన్‌ రైస్‌ తినడం వల్ల కొన్ని పోషకాలు ఒంటికి అంది ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇక, సన్న బియ్యం కన్నా దొడ్డు బియ్యమే మేలు.
 
ఒక కప్పు అన్నంలో..
53.2 గ్రాముల కార్బోహైడ్రేట్లు
242 కెలోరీలు
4.4 గ్రాముల ప్రొటీన్లు
0.6 గ్రాముల ఫైబర్‌
0.4 గ్రాముల కొవ్వు ఉంటాయి.


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!