నరేంద్ర మోదీ బయోపిక్‌లో వివేక్ ఒబెరాయ్
ప్రధాని నరేంద్ర మోదీపై రూపొందనున్న 'పీఎం నరేంద్ర మోదీ' బయోపిక్‌లో మోదీ పాత్రను ఎవరు పోషించబోతున్నారనే సస్పెన్స్‌కు తెరపడింది. నటుడు వివేక్ ఒబెరాయ్ టైటిల్ పాత్రను పోషించనున్నట్టు ఫిల్మ్ ట్రేడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ఓ ట్వీట్‌లో వెల్లడించారు. 'సర్బ్‌జిత్', 'మేరీ కోమ్' వంటి విజయవంతమైన బయోగ్రాఫికల్ డ్రామాలను తీసిన ఒముంగ్ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుందని, ఈ నెల మధ్యలో సినిమా సెట్స్‌పైకి వస్తుందని తరణ్ ఆదర్శ్ తెలిపారు. సినిమా ఫస్ట్ పోస్టర్ 7వ తేదీ సోమవారం ముంబైలో రిలీజ్ చేస్తారని కూడా ఆయన ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.
'సినిమాపై ఇప్పుడు స్పష్టత వచ్చింది. నరేంద్ర మోదీ బయోపిక్‌లో వివేకానంద్ ఒబెరాయ్ (వివేక్ ఒబెరాయ్) టైటిల్ పాత్ర పోషిస్తున్నారు. ఒముంగ్ కుమార్ దర్శకత్వం వహిస్తారు. సందీప్ ఎస్ సింగ్ నిర్మాత. ఫస్ట్ లుక్ పోస్టర్ ఈనెల 7న విడుదలవుతుంది. జనవరి మధ్యలో షూటింగ్ మొదలవుతుంది' అని తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. కాగా, సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను 23 భాషల్లో విడుదల చేస్తారని, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ చేతులమీదుగా పోస్టర్ విడుదలవుతుందని తెలుస్తోంది.
'పోస్టర్ విడుదల కోసం ఫడ్నవిస్‌ను నిర్మాత సందీప్, నటుడు వివేక్ కలిశారు. ఫడ్నవిస్ కూడా సమ్మతి తెలిపారు. దక్షిణ ముంబైలోని గార్వరె క్లబ్ హౌస్‌లో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. సినిమా రిలీజ్ తేదీని కూడా అక్కడే ప్రకటించే అవకాశం ఉంది' అని ప్రొడక్షన్ యూనిట్‌కు చెందిన ఒకరు తెలిపారు.
Comments
Post a Comment