చిన్న వ్యాపారులకు జీఎస్‌టీ ఊరట రెట్టింపు
వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గురువారం వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) మండలి సమావేశం అనంతరం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియాతో మాట్లాడారు.
జీఎస్‌టీ మినహాయింపు పరిమితిని రెట్టింపు చేసినట్లు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలకు రూ.20 లక్షలకు, మిగతా రాష్ట్రాలకు రూ.40 లక్షలకు పెంచినట్లు తెలిపారు. జీఎస్‌టీ కంపోజిషన్ స్కీమ్ పరిథిని కూడా పెంచినట్లు చెప్పారు. గతంలో ఇది రూ.1 కోటి ఉండేదని, దీనిని రూ.1.5 కోట్లకు పెంచామని పేర్కొన్నారు. ఈ స్కీమ్ పరిథిలోకి చిన్న వ్యాపారులు వస్తారు. వీరు తమ వ్యాపారాల టర్నోవరును బట్టి తక్కువ పన్ను చెల్లించే అవకాశం ఉంటుంది.
కేరళ రెండేళ్ళపాటు రాష్ట్రంలో జరిగే అమ్మకాలపై 1 శాతం పన్ను విధించుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు జైట్లీ తెలిపారు. ఈ నిర్ణయాల వల్ల సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపారస్థులకు ప్రయోజనం కలుగుతుందన్నారు.
Comments
Post a Comment