రైతు రుణమాఫీపై కాంగ్రెస్‌పై విరుచుకుపడిన మోదీ

రైతుల రుణ మాఫీపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి కాంగ్రెస్‌ను తప్పుపట్టారు. రైతులను ఓటు బ్యాంకుగా చూస్తున్న ఆ పార్టీ రుణమాఫీ పేరుతో రైతులను తప్పుదారి పట్టిస్తోందని అన్నారు. జార్ఖండ్‌లోని పలములో శనివారం జరిగిన ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ, రైతులను కాంగ్రెస్ కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తుందని, తమ పార్టీ మాత్రం ప్రజలకు తిండి పెట్టే అన్నదాతలుగా చూస్తుందని అన్నారు. కాంగ్రెస్‌కూ, బీజేపీకీ తేడా అదేనని చెప్పారు.
 
'కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే రైతులు లబ్ధి పొంది ఉండేవారు. రుణాలు తీసుకోవాల్సిన అవసరం వారికి ఉండేది కాదు. తొలుత రుణాలు తీసుకోవాలని రైతులను బలవంతం చేసి, ఇప్పుడు రుణ మాఫీ పేరుతో వారిని తప్పుదారి పట్టిస్తున్నారు' అని ప్రధాని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో ప్రజలకు 1 కోటి 25 లక్షల ఇళ్లు ఇచ్చిందన్నారు. ప్రధాని తన పర్యటనలో భాగంగా నార్త్ కోయిల్ (మండల్ డ్యామ్) ప్రాజెక్టు, కన్హర్ స్టోన్ పైప్‌లైన్ ఇరిగేషన్ సిస్టమ్‌కు శంకుస్థాపన చేశారు.


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!