మధ్య తరగతి వర్గానికి భారీ ఉపశమనం రాబోతోంది!

మరో మూడు వారాల్లో కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోంది. తమకు ఏదో ఓ మేలు జరిగే అవకాశం ఉందని ప్రజలంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే జాతీయ మీడియా కథనాల ప్రకారం మధ్య తరగతి వర్గానికి కాస్త ఉపశమనం రాబోతున్నట్లు తెలుస్తోంది.
 
పొదుపు పరిమితిని పెంచడం, పింఛనుదారులకు పన్ను ప్రయోజనాలను పెంచడం, గృహ రుణాలపై వడ్డీ చెల్లింపుపై రాయితీలను పెంచడం వంటి చర్యలను ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్నట్లు సమాచారం.
 
ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాల సమాచారం ప్రకారం నెలవారీ జీతగాళ్ళకు నాలుగేళ్ళ నుంచి ఉపశమనం ఇస్తున్నారు. వీరు పన్ను చెల్లింపులో చాలా నిజాయితీగా వ్యవహరిస్తారనే భావన ఉంది. తాత్కాలిక బడ్జెట్ పరిమితులకు లోబడి ఈసారి కూడా వీరికి ఉపశమనం కల్పించాలని ఆలోచిస్తున్నారు.


Comments

Popular posts from this blog

అర్ధరాత్రి రోడ్లపై తిరిగితే అరెస్ట్‌! టోలీచౌకీ పోలీసుల కఠిన చర్యలు

🔐 కొత్త ఆధార్ కార్డు డిజైన్: ఫోటో & QR కోడ్ మాత్రమే – మీ గోప్యతకు కొత్త రక్షణ!

🗳️🔥 లోక్‌సభలో ఘాటు డిబేట్: రాహుల్ విసిరిన 3 ఆరోపణలకు అమిత్ షా ఇచ్చిన ఝలక్!