రామాలయంపై లీగల్ ప్రక్రియ పూర్తికావాలి: మోదీ
అయోధ్యలో రామాలయ నిర్మాణంపై దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ, కోర్టుల తీర్పు నిర్ణయంలో జరుగుతున్న జాప్యానికి ప్రతిగా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవాలంటూ వస్తున్న డిమాండ్లపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి పెదవి విప్పారు. లీగల్ ప్రక్రియ పూర్తికాగనే ఆర్డినెన్స్ అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. కొత్త సంవత్సరం తొలిరోజు ఏఎన్ఐ ఎడిటర్ స్మితా ప్రకాష్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తొలిసారిగా రామాలయం అంశంపై మోదీ స్పష్టత ఇచ్చారు.
న్యాయ ప్రక్రియ నెమ్మదిగా సాగడానికి కాంగ్రెస్ న్యాయవాదాలు సుప్రీంకోర్టులో ఆటంకాలు కల్పించడమే కారణమని మోదీ ఆరోపించారు. 'రాజ్యాంగ పరిధిలో సమస్యకు పరిష్కారం కనుగొంటామని బీజేపీ మేనిఫెస్టోలో మేము చెప్పాం' అని అన్నారు. సుప్రీంకోర్టు విచారణ ముందు రామాలయం అంశం ఉందని, అది తుది దశకు చేరుకునే అవకాశాలున్నాయని చెప్పారు. జ్యూడిషియల్ ప్రక్రియ పూర్తికాగానే ప్రభుత్వం పరంగా తమపై ఎలాంటి బాధ్యతలు ఉన్నాయో ఆ బాధ్యతలు పూర్తి చేసేందుకు, తగిన చర్యలు తీసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రధాని స్పష్టం చేశారు.
Comments
Post a Comment